సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Seetharamam: తమిళ థియేట్రికల్ రైట్స్ వారికే..

ABN, First Publish Date - 2022-07-27T17:21:16+05:30

మహానటి తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) నటిస్తున్న రెండవ స్ట్రైట్ తెలుగు సినిమా ‘సీతా రామం’ (Sitha ramam). యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానటి తర్వాత మలయాళ స్టార్ హీరో దుల్ఖర్ సల్మాన్ (Dulquer Salman) నటిస్తున్న రెండవ స్ట్రైట్ తెలుగు సినిమా ‘సీతా రామం’ (Sitha ramam). యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్ లైన్. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తమిళ థియేట్రికల్ రైట్స్‌ను కోలీవుడ్ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, నిర్మాణ సంస్థ దక్కించుకుంది. హనురాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ (Mrinal Thakur) హీరోయిన్‌గా, రష్మిక మందన్న కీలక పాత్రలో నటించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ (Swapna Cinemas) బ్యానర్ పై, నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న  థియేటర్స్ విడుదల కాబోతోంది.


ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సీతారామం చిత్రాన్ని తమిళంలో థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు గానూ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని వారే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సీతారామం తమిళ్ రైట్స్ ని అందుకోవడం, అలాగే ఆగష్టు 5 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండడం ఎంతో ఆనందంగా ఉంది'.. అంటూ తమ సోషల్ అకౌంట్స్ లో అఫీషియల్ పోస్ట్ రిలీజ్ చేసింది లైకా ప్రొడక్షన్స్ టీమ్.


కాగా, ఇప్పటికే విడుదలైన సీతారామం మూవీ ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, ట్రైలర్..ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. యుధ్దముతో రాసిన ప్రేమకథ అనే ఓ సరికొత్త కథాంశం తెరకెక్కింది. ఇక ఈ సినిమా తమిళ్ ట్రైలర్ ని కోలీవుడ్ హీరో కార్తీ రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మందన్న ముస్లిం యువతిగా కనిపించబోతుంది.  



Updated Date - 2022-07-27T17:21:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!