సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Pakka Commercial : సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది !

ABN, First Publish Date - 2022-05-26T19:55:18+05:30

యాక్షన్ డైనమైట్ గోపీచంద్ (Gopichand) , దర్శకుడు మారుతి (Maruthi) కలయికలో తెరకెక్కుతోన్న కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో అందాల.. రాశి ఖన్నా (Rashi Khanna) కథానాయికగా నటిస్తోంది. గోపీచంద్ తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా లాయర్ గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా సైతం అతడికి జోడీగా నల్లకోటు తొడుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాక్షన్ డైనమైట్ గోపీచంద్ (Gopichand) ,  దర్శకుడు మారుతి (Maruthi) కలయికలో తెరకెక్కుతోన్న కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial). యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో అందాల.. రాశి ఖన్నా (Rashi Khanna) కథానాయికగా నటిస్తోంది. గోపీచంద్ తన కెరీర్ లోనే మొట్టమొదటి సారిగా లాయర్ గా నటిస్తుండగా.. రాశీ ఖన్నా సైతం అతడికి జోడీగా నల్లకోటు తొడుగుతోంది. ఇదివరకు విడుదలైన ఈ సినిమా టీజర్, సింగిల్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 1న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా చిత్ర బృందం మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఈ మూవీ సెకండ్ సింగిల్‌ను వదలబోతున్నారు మేకర్స్. 


జూన్ 1న ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) నుంచి సెకండ్ సింగిల్ విడుదల కానున్నట్టు నిర్మాతలు ట్విట్టర్ వేదికగా తెలిపారు. దీని కోసం ఒక మాసీ డ్యూయెట్ లిరికల్ సాంగ్ రెడీ కానుంది. గోపీచంద్ (Gopichand), రాశీఖన్నా (Rashi Khanna) స్పెషల్ పోస్టర్‌ను ఈ సందర్బంగా షేర్ చేశారు. గోపీ గత చిత్రం ‘సీటీమార్’ యావరేజ్ హిట్ అందుకుంది. ఆ మూవీ తర్వాత గోపీచంద్ నటిస్తున్న సినిమా కావడంతో ‘పక్కా కమర్షియల్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ప్రతిరోజూ పండగే’ (Prathi Roju Pandage) చిత్రం తర్వాత మళ్ళీ తమిళ నటుడు సత్యరాజ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అంటున్నారు. జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఏ స్థాయిలో మెప్పించబోతుందో చూడాలి. 



Updated Date - 2022-05-26T19:55:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!