సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Satyadev: 'కృష్ణమ్మ' ఇంటెన్స్‌ లుక్‌!

ABN, First Publish Date - 2022-07-04T00:33:16+05:30

వైవిధ్యమైన పాత్రలతో ముందుకెళ్తున్న కథానాయకుడు సత్యదేవ్‌. తాజాగా ఆయన ‘కృష్ణమ్మ’ చిత్రంలో నటిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కృష్ణమ్మ’ పోస్టర్‌ను డుఉదల చేశారు. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. ఇంటెన్స్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యదేవ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైవిధ్యమైన పాత్రలతో ముందుకెళ్తున్న కథానాయకుడు సత్యదేవ్‌(Satyadev). తాజాగా ఆయన ‘కృష్ణమ్మ’ (Krishnamma)చిత్రంలో నటిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కృష్ణమ్మ’ పోస్టర్‌ను డుఉదల చేశారు. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. ఇంటెన్స్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సత్యదేవ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనున్నారు. కత్తి పట్టుకుని ఉన్న సత్యదేవ్‌ పోస్టర్‌ ఆకట్టుకుంటుంది. మంచి, చెడుల కలయిక నది నడత – పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే భావం ఎలివేట్‌ అయ్యేలా పోస్టర్‌ ఉంది. చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్మణ్‌, కృష్ణ, అథిరా రాజ్‌, అర్చన, నంద గోపాల్‌, రఘు కుంచె, తారక్‌, సత్యం తదితరులు నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి, సంగీతం : కాలభైరవ, ఎడిటర్‌: తమ్మిరాజు. (krishnamma first look)




Updated Date - 2022-07-04T00:33:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!