Sarkaru Vaari Paata: ట్విట్టర్ రివ్యూ

ABN , First Publish Date - 2022-05-12T14:16:23+05:30 IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), కీర్తి సురేశ్ (Keerthi Suresh) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)

Sarkaru Vaari Paata: ట్విట్టర్ రివ్యూ

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu), కీర్తి సురేశ్ (Keerthi Suresh) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) నేడు (మే 12) భారీ స్థయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేశ్, గీత గోవిందం (Geetha Govindam) లాంటి క్లాస్ హిట్ తర్వాత దర్శకుడు పరశురామ్ (Parasuram) కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి దేశాలలో సర్కారు వారి పాట ప్రీమియర్ షోస్ పడ్డాయి. అంతేకాదు, ఇండియాలోనూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని చోట్ల కూడా బెనిఫిట్ షోస్ పడ్డాయి. దాంతో అభిమానులు ఈ సినిమా గురించి టిట్టర్ వేదికగా తమ రివ్యూలను ఇస్తున్నారు. దాని ప్రకారం బాబు సర్కారు వారి పాట ఎలా ఉందో చూద్దాం..


సర్కారు వారి పాట సినిమాను జర్మనీలో చూసిన ఓ అభిమాని 'మహేష్ నటన అదిరిపోయింది. మహేష్ స్టైల్, ఫైట్స్, డైలాగ్స్ పరంగా ఇదొక ట్రెండ్ సెట్టర్. కామెడీ, యాక్షన్ అంశాల కలయికలో వచ్చిన రియాలిటీ మూవీ ఇది..' అని సినిమాపై తన రివ్యూను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 


మరో అభిమాని..'మహేష్ పెర్ఫామెన్స్‌కి ఫిదా అయిపోయాను. ఇందులో కొత్త మహేష్‌ను చూశాను. ఇట్స్ వన్ మ్యాన్ షో. సూపర్ స్టార్ ఎప్పుడూ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేయరు. ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు...' అంటూ తన రివ్యూని షేర్ చేశారు.


అలాగే, ఇంకో అభిమాని.. 'సినిమా డీసెంట్ ఎంటర్టైనర్. ప్రేక్షకులకు మాస్ జాతరే'.. అని రాసుకొచ్చాడు. 'మహేష్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు. కీర్తి సురేష్ చాలా అందంగా కనిపించింది. బాగా నటించింది. పాటలు, బీజీఎం మతి పోగొట్టేలా ఉన్నాయి. సినిమాకు రేటింగ్ 3.5.' అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. 


'మహేశ్ అన్న ఇంట్రో అయితే నెక్స్ట్ లెవల్ విత్ థమన్ మ్యూజిక్. ఇది కదా కావాల్సింది. దీని కొసమే అందరూ మహేశ్ ఫ్యాన్స్ వేయిటింగ్..ఆన్‌స్క్రీన్ పెన్నీ సాంగ్ విజువల్ ..మహేశ్ అన్నా నెక్స్ట్ లెవల్ స్వాగ్'.. అంటూ మరో అభిమాని ట్వీట్‌లో రాసుకొచ్చాడు.


దీనినిబట్టి చూస్తుంటే మహేశ్ బాబు ఖాతాలో మరో భారీ కమర్షియల్ హిట్ చేరిందని అర్థమవుతోంది. అయితే, కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాపై మహేశ్ అభిమానులు కూడా ఆశించిన స్థాయిలో లేదనే కామెంట్స్ చేస్తున్నారు. ఎంటర్‌టైన్మెంట్ తప్ప..ఆకట్టుకునే కథ, కథనాలు లేవనే అభిప్రాయాలు అభిమానులనుంచే వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి పూర్తి స్థాయిలో అభిమానులు, ప్రేక్షకులు సర్కారు వారి పాట సినిమాపై ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తారో. సర్కారు వారి పాట అసలు రివ్యూ, పబ్లిక్ టాక్ తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.  

Updated Date - 2022-05-12T14:16:23+05:30 IST

Read more