‘సర్కారు వారి పాట’: సెకండ్ సింగిల్ రెడీ అవుతోంది

ABN , First Publish Date - 2022-03-17T00:27:18+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ ప‌తాకాల‌పై

‘సర్కారు వారి పాట’: సెకండ్ సింగిల్ రెడీ అవుతోంది

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ ప‌తాకాల‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘కళావతి’.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి సెకండ్ సింగిల్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 


ఈ పాట విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా ప్రకటించారు. పాట ఎప్పుడు విడుదల చేసేది రేపు (గురువారం) ప్రకటిస్తామని తెలుపుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో మహేష్ బాబు నడిచివస్తున్న తీరు చూస్తుంటే.. ఎప్పుడెప్పుడు పాట వస్తుందా.. అని వేచి చూస్తున్నట్లుగా ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. సంగీత సంచలనం ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. Updated Date - 2022-03-17T00:27:18+05:30 IST

Read more