Mahesh: కావాలంటే రాసుకోండి: మహేశ్‌బాబు

ABN , First Publish Date - 2022-05-08T06:10:00+05:30 IST

‘ఈ చిత్రంలో నా పాత్రను కొత్తగా డిజైన్‌ చేశారు దర్శకుడు. ఆ పాత్ర చేస్తున్నప్పుడు ‘పోకిరి’ అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ కథ చెప్పిన తర్వాత దర్శకుడు ఓ మెసేజ్‌ చేశారు. ‘ఒక్కడు సినిమా చూసి బండెక్కి దర్శకుడిని అవుదామని వచ్చేశా. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చారు. ఎలా తీస్తానో చూడండి’ అన్నారు. అన్నట్లుగానే నా అభిమానులు గర్వపడేలా సినిమా తీశారు. ఇందులో హీరోహీరోయిన్ల ట్రాక్‌ కోసం రిపీటెడ్‌ ఆడియన్స్‌ ఉంటారు. కావాలంటే రాసుకోండి’’ అని మహేశ్‌బాబు అన్నారు.

Mahesh: కావాలంటే రాసుకోండి: మహేశ్‌బాబు

‘‘ఈ చిత్రంలో నా పాత్రను కొత్తగా డిజైన్‌ చేశారు దర్శకుడు. ఆ పాత్ర చేస్తున్నప్పుడు ‘పోకిరి’ అప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ కథ చెప్పిన తర్వాత దర్శకుడు ఓ మెసేజ్‌ చేశారు. ‘ఒక్కడు సినిమా చూసి బండెక్కి దర్శకుడిని అవుదామని వచ్చేశా. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చారు. ఎలా తీస్తానో చూడండి’ అన్నారు. అన్నట్లుగానే నా అభిమానులు గర్వపడేలా సినిమా తీశారు. ఇందులో హీరోహీరోయిన్ల ట్రాక్‌ కోసం రిపీటెడ్‌ ఆడియన్స్‌ ఉంటారు. కావాలంటే రాసుకోండి’’ అని మహేశ్‌బాబు (Mahesh babu)అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’ (Sarkaru vaari paata)చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది.  కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి పరశురామ్‌ (Parasuram petla) దర్శకత్వం వహించారు. ఈ నెల 12న చిత్రం విడుదల కానుంది.


మహేశ్‌(Mahesh) మాట్లాడుతూ ‘‘ఈ రెండేళ్లలో చాలా జరిగాయి.. చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దగ్గరైన వాళ్లు దూరమయ్యారు. ఏం జరిగినా, ఏది మారినా అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు మాత్రం మారలేదు. ఇది చాలు ఽనాకు. దైర్యంగా ముందుకెళ్తా. మే 12న మీ అందరికీ నచ్చే సినిమా రాబోతోంది. మళ్లీ మనందరికీ పండగే. మీ అభిమానం, బ్లెసింగ్స్‌ ఎప్పుడూ నాతో ఉండాలని కోరుకుంటున్నా. కీర్తి సురేశ్‌ పాత్ర, నటన అమేజింగ్‌గా ఉంటుంది’’ అని అన్నారు. 



‘‘సర్కారువారి పాట’ కథ రాసిన తర్వాత అది మహేశ్‌ వరకూ వెళ్లడానికి కొరటాల శివ సాయం చేశారు. ఆయనకు క్యారెక్టరైజేషన్‌ గురించిచెబుతుంటే నాకు భయమేసింది. ఐదు నిమిషాల తర్వాత మహేశ్‌ ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ చిరునవ్వుతోనే ఇక్కడి వరకూ వచ్చా. ఎడిటింగ్‌ సమయంలో మార్తాండ్‌కె వెంకటేశ్‌ ఫోన్‌ చేసి ‘పోకిరి’లా ఉందని చెప్పారు’’ అని పరశురామ్‌ అన్నారు. 


‘‘మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి పనిచేయాలనే కోరిక ఈ చిత్రంతో నెరవేరింది. కళావతిని నాకు బహుమతిగా ఇచ్చినందుకు పరశురామ్‌కు థ్యాంక్స్‌. రెండేళ్లగా మహేశ్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఆయన ఉన్నారు.. ఆయన విన్నారు’’ అని కీర్తి సురేశ్‌ (Keerthi suresh)అన్నారు. 

Updated Date - 2022-05-08T06:10:00+05:30 IST