‘నేను ఉన్నాను..’ డైలాగ్ ఎఫెక్ట్: ఏపీలో ‘Sarkaru Vaari Paata’ టికెట్ల ధరల పెంపు

ABN , First Publish Date - 2022-05-08T04:57:05+05:30 IST

రీసెంట్‌గా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు (SuperStar Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) ట్రైలర్‌లో ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అనే డైలాగ్‌పై ఎటువంటి చర్చలు జరిగాయో.. జరుగుతున్నాయో

‘నేను ఉన్నాను..’ డైలాగ్ ఎఫెక్ట్: ఏపీలో ‘Sarkaru Vaari Paata’ టికెట్ల ధరల పెంపు

రీసెంట్‌గా విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు (SuperStar Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) ట్రైలర్‌లో ‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అనే డైలాగ్‌పై ఎటువంటి చర్చలు జరిగాయో.. జరుగుతున్నాయో తెలియంది కాదు. ఆంధప్రదేశ్‌ (Andhra Pradesh)లో అధికారంలో ఉన్న వైసీపీ(YCP) పార్టీ ఎన్నికల ప్రచారంలో.. ఆ పార్టీ నాయకుడు వాడిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్‌ను సినిమాలో మహేష్ బాబు చేత దర్శకుడు పరశురామ్ (Parasuram) చెప్పించి.. ఏపీ ప్రభుత్వం దృష్టిలో ఈ సినిమా పడేలా చేశారు. దీంతో.. ఎటువంటి ప్రయాసలు పడకుండానే.. ఏపీ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం ఒక్కో టికెట్‌కు సుమారు రూ. 45 రూపాయలు పెరగగా.. 10 రోజుల పాటు పెరిగిన ధరలు అమలయ్యేలా ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లుగా తాజా సమాచారం. దీంతో మహేష్ బాబు అభిమానులే కాదు, వైసీపీ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


మహేష్ అభిమానులు.. తమ హీరో సినిమా టికెట్ ధరలు పెరిగాయి కాబట్టి.. మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ఆనందపడుతుంటే, వైసీపీ అభిమానులు మరోసారి పవన్ కల్యాణ్‌ని సీన్‌లోకి తెస్తూ.. ఆనందిస్తున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో తెలియంది కాదు. పవర్ స్టార్‌ (Power Star)కి పోటీనిచ్చే హీరోగా చెప్పుకునే మహేష్ విషయంలో మాత్రం.. చాలా ఈజీగా పనులు జరిగిపోతున్నాయి. అందులోనూ డైలాగ్ ఎఫెక్ట్ చాలా బాగా పనిచేస్తుందని అంతా అనుకుంటుండటం గమనార్హం. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకాబోతోందీ చిత్రం.  Updated Date - 2022-05-08T04:57:05+05:30 IST

Read more