సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘సర్కారు వారి పాట’కి కూడా విడుదల తేదీ ఖరారు

ABN, First Publish Date - 2022-02-01T01:36:03+05:30

‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘ఎఫ్3’ చిత్రాల విడుదల తేదీలను వరసగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘భీమ్లా నాయక్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’, ‘ఎఫ్3’ చిత్రాల విడుదల తేదీలను వరసగా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సర్కారు వారి పాట’ చిత్ర విడుదల తేదీని కూడా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. చిత్రాన్ని మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఇంకా చాలా టైమ్ ఉందిలే.. అన్నట్లుగా మహేష్ బాబు రెస్ట్ తీసుకుంటున్నారు.


మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. మహేష్ బాబు సరసన కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయనున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2022-02-01T01:36:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!