Sarkaru Vaari Paata: దుమ్మురేపుతోన్న ‘మ..మ.. మహేశా’ ఫుల్ సాంగ్

ABN , First Publish Date - 2022-05-08T02:09:28+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న దర్శకుడు పరశురామ్

Sarkaru Vaari Paata: దుమ్మురేపుతోన్న ‘మ..మ.. మహేశా’ ఫుల్ సాంగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu), కీర్తి సురేష్(Keerthi Suresh) హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata). ‘గీత గోవిందం’ (Geetha Govindam) చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్న దర్శకుడు పరశురామ్ (Parasuram) దర్శకత్వంలో రూపొందిన ఈ  చిత్రం మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు యమా జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం చిత్రంలోని మాస్ సాంగ్ ‘మ.. మ.. మహేశా’ వీడియో సాంగ్ ప్రోమోని చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్‪లో టాప్ ప్లేస్‪లో ట్రెండ్ అవుతోంది. ఈ స్పందన చూసిన మేకర్స్ తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్‪ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ ప్రపంచంలో దుమ్ము రేపుతోంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ పోటీ పడి మరీ ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఇక మహేష్ స్టెప్స్ చూసిన అభిమానులు (Fans) అయితే పండగ చేసుకుంటున్నారు. 


‘సన్నజాజి మూర తెస్తా సోమవారం.. 

మల్లెపూల మూర తెస్తా మంగళారం.. అరె

బంతిపూల మూర తెస్తా బుధవారం..

గుత్తి పూల మూర తెస్తా గురువారం..’’ వంటి లిరిక్స్‪తో సాగిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ (Anantha Sriram) సాహిత్యం అందించగా.. సింగర్స్ శ్రీకృష్ణ (Sri Krishna), జోనితా గాంధీ (Jonita Gandhi) ఆలపించారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ (Thaman S) మరోసారి తన మార్క్ సంగీతం అందించగా.. మహేష్ బాబు నుండి అభిమానులు ఎలాంటి డ్యాన్స్ చూడాలని అనుకుంటున్నారో.. అలాంటి స్టెప్స్ కంపోజ్ చేశారు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master). ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన పాటల మాదిరిగానే.. ఈ పాట కూడా చార్ట్ బస్టర్ లిస్ట్‪లో చేరడం గ్యారంటీ. అలాగే వ్యూస్ పరంగానూ ఈ పాట సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అనేలా మహేష్ బాబు అభిమానులు ఈ పాటకి కామెంట్స్ చేస్తున్నారు. కాగా,  ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. 



Updated Date - 2022-05-08T02:09:28+05:30 IST