గ్యారేజ్‌లో కొత్త కారుకి చోటిచ్చిన మహేశ్ బాబు

ABN , First Publish Date - 2022-04-16T22:56:04+05:30 IST

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు కొత్త కారును కొనుగోలు చేశాడు. ఆడి బ్రాండ్‌కు చెందిన కారుకు తన గ్యారేజ్‌లో చోటు కల్పించాడు.

గ్యారేజ్‌లో కొత్త కారుకి చోటిచ్చిన మహేశ్ బాబు

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు కొత్త కారును కొనుగోలు చేశాడు. ఆడి బ్రాండ్‌కు చెందిన కారుకు తన గ్యారేజ్‌లో చోటు కల్పించాడు.  ‘ఈ ట్రాన్’ అనే ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్)ని అతడు సొంతం చేసుకున్నాడు. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ ఈ కారును స్టార్ హీరోకి అందజేశాడు. దీని ధర రూ. 1 కోటి నుంచి రూ.1.2కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మహేశ్ బాబుతో తీసుకున్న ఫొటోను ఆడి ఇండియా సంస్థ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.


ఓ మెసేజ్‌ను కూడా ఆ సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది.‘‘భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. ‘ఆడి’ని ఎక్స్ పిరియన్స్ చేయడానికీ మహేశ్ బాబుకు స్వాగతం చెబుతున్నాం’’ అని ఆడి ఇండియా తెలిపింది. ఈ కారును కొనడం ద్వారా ఎస్‌యూవీలను సొంతం చేసుకున్న నటుల జాబితాలోకి మహేశ్ బాబు చేరాడు. ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. పరశురాం తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. వేసవి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.



Updated Date - 2022-04-16T22:56:04+05:30 IST