సంపూ క్యారెక్టర్ సస్పెన్స్
ABN , First Publish Date - 2022-05-18T05:49:16+05:30 IST
‘హీరో సంపూర్ణేష్ బాబు ఇప్పటివరకూ చేసిన పాత్రలు ఒక ఎత్తయితే ‘ధగఢ్ సాంబ’ ఒక్కటి మరో ఎత్తు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుని...
‘హీరో సంపూర్ణేష్ బాబు ఇప్పటివరకూ చేసిన పాత్రలు ఒక ఎత్తయితే ‘ధగఢ్ సాంబ’ ఒక్కటి మరో ఎత్తు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుని సరికొత్తగా చూస్తారు’ అని దర్శకుడు ఎన్.ఆర్. రెడ్డి అన్నారు. సంపూర్ణేష్ బాబు, సోనాక్షి జంటగా ఆయన రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి మాట్లాడుతూ...
‘‘ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి వచ్చి దర్శకుడిగా మారాను. దర్శకుడిగా నాకు ఇది మూడో చిత్రం. కథ, స్ర్కీన్‌ప్లే, పాటలు నేనే రాశాను. సంపూ గారు ఇప్పటిదాకా ఇలాంటి మాస్ యాక్షన్ సినిమా చేయలేదు. రొమాంటిక్ కామెడీ రివెంజ్ స్టోరీ ఇది. సంపూగారిది సస్పెన్స్ క్యారెక్టర్. ఆయన కెరీర్లో ఈ సినిమా ఓ మైలురాయి అవుతుంది. సినిమాలో మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. టెక్నీషియన్స్ అందరూ డెడికేటెడ్‌గా వర్క్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. పేరడీ కామెడీ ఈ సినిమాలో ఉండదు. కుటుంబ ప్రేక్షకులు చూసేలా ఉంటుందీ సినిమా’’ అన్నారు.