Yashoda OTT Release: ‘యశోద’ ఓటీటీ విడుదలకి లైన్ క్లియర్.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

ABN , First Publish Date - 2022-12-06T16:48:43+05:30 IST

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన తాజా చిత్రం ‘యశోద’ (Yashoda). అద్దె గర్భం (Surrogacy) అనే విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం..

Yashoda OTT Release: ‘యశోద’ ఓటీటీ విడుదలకి లైన్ క్లియర్.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే..

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన తాజా చిత్రం ‘యశోద’ (Yashoda). అద్దె గర్భం (Surrogacy) అనే విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. నవంబర్‌ 11న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హరి-హరీష్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ దాదాపు రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టి సత్తా చాటింది. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత నటనకు అభిమానులతో పాటు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. (Yashoda OTT Release Date)


అయితే.. థియేటర్స్‌లో ఈ సినిమాని చూడలేకపోయిన ఎంతోమంది సినీ లవర్స్ ఈ చిత్ర ఓటీటీ విడుదల గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలోకి రావాల్సింది. కానీ ‘ఈవా’ హాస్పిటల్స్ కేసు వేయడంతో విడుదలని నిలిపి వేశారు. తాజాగా దీనికి సంబంధించిన వివాదం సద్దు మణిగింది. దీంతో ఈ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ ఉన్న అడ్డు తొలగింది. దాంతో ఈ నెల 9న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఆ ఓటీటీ యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన రానుంది. కాగా.. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతూనే ఈ చిత్రానికి సమంత డబ్బింగ్‌ కంప్లీట్‌ చేయడం విశేషం.





Updated Date - 2022-12-06T16:48:43+05:30 IST