సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Samantha Ruth Prabhu: ఆ ప్రాజెక్టు కోసం హిందీలో శిక్షణ

ABN, First Publish Date - 2022-09-29T21:32:27+05:30

నాగ చైతన్య (Naga Chaitanya) తో విడాకుల ప్రకటన తర్వాత సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) వరుసగా సినిమాలను ఓకే చేస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ చైతన్య (Naga Chaitanya) తో విడాకుల ప్రకటన తర్వాత సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) వరుసగా సినిమాలను ఓకే చేస్తుంది. ముఖ్యంగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు సై అంటుంది. కొత్త చిత్రాల కోసం తెగ కష్టపడుతుంది. సామ్ కొన్ని రోజుల క్రితం అమెరికాకు వెళ్లి నిపుణుల సమక్షంలో యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంది. కఠినమైన డైట్‌ను కూడా ఫాలో అయిందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా సమంతకు సంబంధిన ఓ అప్‌డేట్ బీ టౌన్‌లో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే..  


సమంత రుత్ ప్రభు ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘సిటాడెల్’ (Citadel) కు రీమేక్‌గా ఈ వెబ్‌సిరీస్ రూపొందుతుంది. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుంది. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో స్పై పాత్రలో సామ్ కనిపించనుందని సమాచారం. పాత్ర కోసం ఆమె హిందీలో శిక్షణ తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రత్యేకంగా ట్యూటర్‌ను పెట్టుకుని భాష నేర్చకుంటుందట. ఆ ట్యూటర్ గతంలో అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలకు హిందీలో శిక్షణ ఇచ్చాడట. ‘సిటాడెల్’ అమెరికన్ వెబ్‌సిరీస్. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం సమంత చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ‘శాకుంతలం’ (Shaakuntalam) షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసింది. ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘యశోద’, ‘ఖుషి’ (Kushi) వంటి చిత్రాలు చేస్తుంది. 

Updated Date - 2022-09-29T21:32:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!