Samantha: స్పై పాత్ర కోసం శిక్షణ

ABN , First Publish Date - 2022-09-24T00:38:30+05:30 IST

నాగ చైతన్య (Naga Chaitanya) తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత సమంత (Samantha) ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమాలను ఓకే చేస్తుంది. బాలీవుడ్‌కు కూడా ఆమె ఎంట్రీ

Samantha: స్పై పాత్ర కోసం శిక్షణ

నాగ చైతన్య (Naga Chaitanya) తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత సమంత (Samantha) ఫుల్ జోష్‌లో ఉంది. వరుస సినిమాలను ఓకే చేస్తుంది. బాలీవుడ్‌కు కూడా ఆమె ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు సంతంకం చేసిందని తెలుస్తోంది. సామ్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్ బీ టౌన్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. అదేంటంటే.. 


సమంత రుత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘సిటాడెల్’ (Citadel) కు రీమేక్‌గా ఈ ప్రాజెక్టు రూపొందుతుంది. రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. స్పై పాత్రలో సామ్ కనిపించనుందని సమాచారం. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ ప్రాజెక్టు తెరకెక్కనుంది. అందువల్ల ఈ వెబ్‌సిరీస్‌లో పోరాట సన్నివేశాలు అనేకం ఉన్నాయని తెలుస్తోంది. సామ్ ప్రస్తుతం నిపుణుల సమక్షంలో అమెరికాలో పాత్ర కోసం సిద్ధమవుతుందట. అందుకోసం కఠినమైన డైట్‌ను ఫాలో అవుతుందట. ఈ ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి సారించడంతోనే ఆమె సోషల్ మీడియాకు దూరంగా ఉందని తెలుస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో ఒక్క పోస్ట్ కూడా షేర్ చేయడం లేదు. ‘సిటాడెల్’ అమెరికన్ వెబ్‌సిరీస్. ప్రియాంక చోప్రా, రిచర్డ్ మ్యాడెన్ కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం సమంత చేతిలో అనేక ప్రాజెక్టులున్నాయి. ‘శాకుంతలం’ ( Shaakuntalam) షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసింది. ఈ సినిమా నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘యశోద’, ‘ఖుషి’ (Kushi) సినిమాలలో కూడా నటిస్తుంది. ‘ఖుషి’ లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా చిత్రం రూపొందుతుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్‌లో మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది.              


Updated Date - 2022-09-24T00:38:30+05:30 IST