సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

God Father: గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ డబ్బులు తీసుకోలేదు

ABN, First Publish Date - 2022-10-01T21:43:45+05:30

God Father: గాడ్ ఫాదర్ కోసం సల్మాన్ ఖాన్ డబ్బులు తీసుకోలేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సల్మాన్ ఖాన్ (Salman Khan) భారత దేశం లో వున్నా అగ్ర నటుల్లో ఒకరు. అతని సినిమా వస్తోంది అంటే చాలు, ప్రపంచం అంత అతని లక్షలాది మంది అభిమానులు (Lakhs of fans) ఎదురు చూస్తూ వుంటారు. ముద్దుగా సల్మాన్ భాయ్ (Salman Bhai) అని పిలుచుకునే, సల్మాన్ ఖాన్ తన గౌరవాన్ని మన మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) పట్ల చాటుకున్నాడు. చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ (God Father) సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ప్రముఖ పాత్ర వేస్తున్న సంగతి తెలిసిందే కదా. అందుకని చిరంజీవి సల్మాన్ ఖాన్ ని సంప్రదించినప్పుడు వెంటనే అంగీకరించాడుట. అసలు ఏంటి తన పాత్ర అని కూడా అడగలేదుట. చిరు మలయాళం సినిమా లూసిఫెర్ లో పృథ్విరాజ్ కుమార్ చేసిన పాత్ర అని చెప్పాడట. కానీ చిన్నదా పెద్దదా అని చూడకుండా ఏదైనా చేస్తాను అని చెప్పాడట సల్మాన్. ఇది అతని ఉదారతకు నిదర్శనం. అలాగే చిరంజీవి కుటుంబం అంటే కూడా సల్మాన్ కి అంతులేని ప్రేమ, గౌరవం కూడాను.


సినిమా షూటింగ్ అయ్యాక, నిర్మాత సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒక చెక్ తీసుకొని వెళ్ళాడట. సల్మాన్ మేనేజర్ కి ఇచ్చి, ఇది సల్మాన్ ఖాన్ కి ఇవ్వు అని చెప్పి, బయట కొంచెం ఇబ్బందిగానే వున్నాడట చిరంజీవి. ఎందుకంటే సల్మాన్ కి అది చాల తక్కువ రెమ్యూనరేషన్ అని. కానీ వెళ్లిన మేనేజర్, అంతే వేగంగా వెనక్కి వచేసాడట. 'నేను రిస్క్ చెయ్యలేను సర్, ఈ చెక్ సల్మాన్ పుచ్చుకోవటం లేదు. చిరంజీవి సినిమా చేస్తున్నప్పుడు నేను డబ్బులు తీసుకోవటమా, ఆలా ఎన్నటికీ జరగదు' అని చెప్పాడట మేనేజర్. చిరంజీవి ఈ మాటలు చెపుతూ ఎంతో భావేద్వేగానికి గురి అయి, సల్మాన్ ఖాన్ కి తాను, రామ్ చరణ్ ఎంతో రుణపడి వున్నాం అని చెప్పాడు చిరంజీవి. 

అదే విధంగా షూటింగ్ సమయం లో కూడా సల్మాన్ ఖాన్ చూపించిన ఆదరణ మర్చిపోలేనిది అని చిరంజీవి చెప్పాడు. షూటింగ్ ఒకవేళ పోస్ట్ పోనే అయి ఇంకో డేట్ ఫిక్స్ అయినపుడు కూడా ఏమి అనకుండా అలాగే పరవాలేదు, మీరు ఎప్పుడంటే అప్పుడే షూటింగ్ చేద్దాం అని చెప్పేవాడు సల్మాన్ ఖాన్, నిజంగా అతని సహృదయతకు జోహార్లు అని చెప్పాడు చిరంజీవి.

Updated Date - 2022-10-01T21:43:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!