Agent బ్యూటీ లుక్ ఇదే !

ABN , First Publish Date - 2022-06-19T21:15:05+05:30 IST

అక్కినేని నవయువ కథానాయకుడు అఖిల్ (Akhil) ఐదవ చిత్రం ‘ఏజెంట్’ (Agent). సురేంద్ర రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.

Agent బ్యూటీ లుక్ ఇదే !

అక్కినేని నవయువ కథానాయకుడు అఖిల్ (Akhil) ఐదవ చిత్రం ‘ఏజెంట్’ (Agent). సురేంద్ర రెడ్డి (Surender Reddy) దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. విదేశాల్లో పలు షెడ్యూల్స్ చిత్రీకరణ జరిగింది. ఇందులోని పాత్ర కోసం అఖిల్ గంటల తరబడి జిమ్ లో కసరత్తులు చేసి సిక్స్ ప్యాక్ బిల్డ్ చేశాడు. ‘ఏజెంట్’ చిత్రాన్ని ప్రకటించిన రోజున విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya) నటిస్తోంది. నేడు (జూన్ 19) ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ..  సాక్షి వైద్య లుక్ ను విడుదల చేశారు మేకర్స్. 


జీన్స్ ఫ్యాంట్, బ్రైన్ కలర్ టాప్ తో సాక్షి వైద్య లుక్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో సాక్షి కీలకమైన పాత్ర చేస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ సూపర్ హిట్ ‘బోర్న్’ (Bourne) సిరీస్ ఆధారంగా ఏజెంట్ చిత్రం రూపొందుతోంది. వక్కంతం వంశీ (Vakkantham Vamshy) కథ అందిస్తుండగా.. హిప్ హాప్ తమిళ (Hiphop Tamizha) సంగీతం సమకూర్చుతున్నాడు. అతి త్వరలో ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ (Most Eligible Bachlor) చిత్రంతో తన కెరీర్ లో మొదటి హిట్ అందుకున్న అఖిల్.. ‘ఏజెంట్’ చిత్రంతో మరింత పెద్ద హిట్ అందుకోవాలనుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో అతడికి ఏ స్థాయిలో సక్సెస్ సొంతమవుతుందో చూడాలి. 



Updated Date - 2022-06-19T21:15:05+05:30 IST