సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Dhanush విలన్‌గా డైలాగ్ కింగ్

ABN, First Publish Date - 2022-07-06T16:51:21+05:30

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. తొలి తెలుగు ఎంట్రీ మూవీ ‘సార్‌’ (Sir) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. తొలి తెలుగు ఎంట్రీ మూవీ ‘సార్‌’ (Sir) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ,  సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది.  ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎడ్యుకేషన్ మాఫియాపై.. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న ఒక యువకుడు సాగించిన పోరాటమే ఈ సినిమా కథాంశం. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ప్రైవేటీకరణపై అతడు తిరుగుబాటు చేస్తాడు. ఇంచుమించు ఇలాంటి కథాంశంతోనే ఇది వరకు ‘రఘువరన్ బీటెక్’ (Raghuvaran Btech) చిత్రంలో నటించాడు ధనుష్. కాకపోతే అందులో అతడు బీటెక్ గ్రాడ్యుయేట్. ‘సార్’ చిత్రంలో అతడొక లెక్చరర్. 


ఇక ‘సార్’ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇందులో విలన్‌గా సాయికుమార్ (Saikumar) నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఆ పాత్ర గురించి ఇతర సమాచారం తెలుపలేదు. డైలాగ్ కింగ్‌గా దక్షిణాదిన పేరొందిన సాయికుమార్‌కు విలన్ పాత్రలు కొట్టిన పిండి. ఇదివరకు చాలా సినిమాల్లో ఆయన విలన్‌గా నటించి మెప్పించారు. గంభీరమైన వాయిస్‌తో ఆయన పలికే డైలాగ్స్ ఆయా చిత్రాలకే హైలైట్స్‌గా నిలిచాయి. ఇటీవల ‘గాలివాన’ (Gaalivaana) వెబ్ సిరీస్‌లో నెగెటివ్ రోల్‌లో అదరగొట్టారు సాయికుమార్. ఇప్పుడు ధనుష్ ‘సార్’ కే విలన్‌గా నటించనుండడం విశేషాన్ని సంతరించుకుంది.  


సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా తనికెళ్ళ భరణి (Tanikella Bharani), నర్రా శ్రీనివాస్ (Narra Srinivas) కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాశ్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందిస్తుండగా.. దినేశ్ కృష్ణన్ (Dinesh Krishnan) ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. ‘తొలిప్రేమ’ (Toliprema) చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి.. ‘మిస్టర్ మజ్ను (Mister Majnu), రంగ్‌దే (Rangde)’ చిత్రాలతో పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ‘సార్’ చిత్రంపైనే అతడు ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా గానీ సూపర్ హిట్ అయితే.. దర్శకుడిగా వెంకీకి ఇక తిరుగుండదు. మరి ‘సార్’ మూవీకి సాయికుమార్ విలనిజం ఏ స్థాయిలో హైలైట్ కానుందో చూడాలి.  

Updated Date - 2022-07-06T16:51:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!