సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పూజా కార్యక్రమాలతో ‘Nelson’ మూవీ ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-13T02:21:39+05:30

జయంత్‪ (Jayanth)ను హీరోగా పరిచయం చేస్తూ.. జె.కె.మూవీస్ (JK Movies) పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా యువ దర్శకుడు సాయి సునీల్ నిమ్మల (Sai Sunil Nirmala) దర్శకత్వంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయంత్‪ (Jayanth)ను హీరోగా పరిచయం చేస్తూ.. జె.కె.మూవీస్ (JK Movies) పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా యువ దర్శకుడు సాయి సునీల్ నిమ్మల (Sai Sunil Nimmala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘నెల్సన్’ (Nelson). జయంత్ కార్తీక్ (Jayanth Karthik) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంస్థ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది. ఉత్కంఠభరిత కథాంశంతో, స్టైలిష్ మేకింగ్‪తో రూపొందనున్న ఈ చిత్రంలో అనుషా రాయ్, సెహర్ కృష్ణన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం.. త్వరలో రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది.


ఈ సందర్భంగా దర్శకుడు సాయి సునీల్ నిమ్మల మాట్లాడుతూ.. ‘‘ఊహించని కథాంశంతో ఉత్కంఠభరితంగా ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తుంది. ప్రస్తుతం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని త్వరలోనే ప్రారంభిస్తాము. రాజమండ్రి, వైజాగ్, హైదరాబాద్ లలోని పలు లొకేషన్లలో చిత్రీకరణ జరపనున్నాము. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాము..’’ అని తెలిపారు. కాగా, అజయ్ పట్నాయక్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం సాయి సునీల్ నిమ్మల. 

Updated Date - 2022-05-13T02:21:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!