ఎన్టీఆర్‌తో సాయి పల్లవి?

ABN , First Publish Date - 2022-06-01T11:25:10+05:30 IST

ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్‌ టీజర్‌ ఒకటి విడుదల చేశారు...

ఎన్టీఆర్‌తో సాయి పల్లవి?

ఎన్టీఆర్‌ - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా డైలాగ్‌ టీజర్‌ ఒకటి విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ముందు నుంచీ ఈ సినిమాలో నాయికగా జాన్వీ కపూర్‌ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆ తరవాత పూజా హెగ్డే అని కూడా అనుకొన్నారు. ఇప్పుడు సాయిపల్లవి రేసులోకి వచ్చారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా ఎంచుకొనే అవకాశాలు గట్టిగా ఉన్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాల టాక్‌. అయితే చిత్రబృందం మాత్రం ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అనిరుథ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నందమూరి కల్యాణ్‌ రామ్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.   


Updated Date - 2022-06-01T11:25:10+05:30 IST

Read more