సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా ఇది: Sai Pallavi

ABN, First Publish Date - 2022-06-16T22:45:53+05:30

యదార్ధ సంఘటనల ఆధారంగా నేను ఇప్పటివరకూ సినిమాలు చేయలేదు. ఈ సినిమా చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. రేపు ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుందని నమ్ముతున్నాను. వెన్నెల వంటి గొప్ప పాత్ర ఇచ్చిన వేణుగారికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘యదార్ధ సంఘటనల ఆధారంగా నేను ఇప్పటివరకూ సినిమాలు చేయలేదు. ‘విరాట పర్వం’ (Virata Parvam) చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా చూసే ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుందని నమ్ముతున్నాను’’ అని అన్నారు న్యాచురల్ నటి సాయిపల్లవి (Sai Pallavi). ఆమె హీరోయిన్‌గా, రానా దగ్గుబాటి (Rana Daggubati) హీరోగా.. వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు (D Suresh Babu) సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ (SLV Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మించారు. జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను బుధవారం హైదరాబాద్‌లో మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాయిపల్లవి మాట్లాడుతూ.. 


‘‘వెంకటేష్‌గారు ఈ వేడుకకు వచ్చి మా టీమ్‌ని ఆశీర్వదించినందుకు చాలా ఆనందంగా వుంది. ‘విరాట పర్వం’ నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా. యదార్ధ సంఘటనల ఆధారంగా నేను ఇప్పటివరకూ సినిమాలు చేయలేదు. ఈ సినిమా చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. రేపు ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతే కలుగుతుందని నమ్ముతున్నాను. వెన్నెల వంటి గొప్ప పాత్ర ఇచ్చిన వేణుగారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం తర్వాత కూడా వేణుగారు మంచి కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని నమ్ముతున్నాను. డానీ, దివాకర్ మణి, సురేష్ బొబ్బిలి, నాగేంద్రగారు ఇలా సాంకేతిక నిపుణులు అంతా గొప్పగా పని చేశారు. వారు చేసిన వర్క్ ని మీరు థియేటర్‌లోనే ఎంజాయ్ చేయాలి. ఈశ్వరిగారు, నవీన్ చంద్ర, సాయి చంద్‌గారు, ప్రియమణిగారు, జరీనా వాహేబ్, రాహుల్ .. వీరి పాత్రలన్నీ చాలా గొప్పగా వుంటాయి. నిర్మాతలు సుధాకర్‌గారు, శ్రీకాంత్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. విరాట పర్వాన్ని ఒక బిడ్డలా చూసుకున్నారు. వారికి ఎంతగా థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. రానాగారు గొప్ప మనసున్న మనిషి. ఆయన ఎత్తుకు తగ్గట్టే పెద్ద మనసున్న మనిషి. గొప్ప కథలు, మంచి కథలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో రానాగారు మన ఇండస్ట్రీకి టార్చ్ బేరర్ లాంటి వారు. ఆయనతో పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నా. జూన్ 17న విరాట పర్వం చూడండి. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించండి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మీ ప్రేమకు కోటి ధన్యవాదాలు’’ అని తెలిపారు.

Updated Date - 2022-06-16T22:45:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!