Sai Pallavi: వివాదాస్పద వ్యాఖ్యలపై సాయిపల్లవి స్పందన ఇదే!

ABN , First Publish Date - 2022-06-17T02:11:29+05:30 IST

రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’ (Virata Parvam). జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి విరివిగా ప్రచార కార్యక్రమాలను

Sai Pallavi: వివాదాస్పద వ్యాఖ్యలపై సాయిపల్లవి స్పందన ఇదే!

రానా దగ్గుబాటి (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’ (Virata Parvam). జూన్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రానా దగ్గుబాటి, సాయిపల్లవి విరివిగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ.. కొందరు ఆమెపై కేసులు పెట్టే వరకు వెళ్లారు. రెండు రోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా ఈ వివాదంపై సాయిపల్లవి స్పందించింది.


అసలు సాయిపల్లవి ఏమందో తెలియాలంటే ఇక్కడ క్లిక్ చేయండి


గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెబుతాను.. కానీ ఇది సమయం కాదు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా.. అదేదో సినిమా ప్రమోషన్ కోసం చేశానని, చెప్పానని అనుకుంటారు. ఈ వివాదం నుంచి నన్ను సేవ్ చేయాలని నా అభిమానులు కూడా చూస్తున్నారని తెలుసు. ప్రస్తుతం నేను ‘విరాట పర్వం’ సినిమా విడుదలవుతున్న ఆనందంలో ఉన్నాను. సినిమా విడుదల తర్వాత.. ఈ వివాదంపై మాట్లాడతాను..’’ అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. 


ఇదే వేడుకలో ఈ వివాదంపై రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘‘నేను లేని సమయంలో సాయిపల్లవిని మాట్లాడించారు. నేను ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు. అయినా ఇంత పెద్ద ప్రెస్‌ మీట్‌లో వివాదాల గురించి మాట్లాడాల్సిన సందర్భం అయితే ఇది కాదు. టీమ్ అంతా ఎంతో కష్టపడి ‘విరాట పర్వం’ చిత్రం చేశాము. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరుతున్నాను..’’ అని అన్నారు.



Updated Date - 2022-06-17T02:11:29+05:30 IST