ఆ వయసులోనే పెళ్లి, ఇద్దరు పిల్లలు అనుకున్నా: సాయిపల్లవి (OHRK Live)
ABN , First Publish Date - 2022-06-11T02:36:19+05:30 IST
సాయిపల్లవి (Sai Pallavi) పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆ పేరుకి ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇటీవల ఓ ఈవెంట్‌లో సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అంటూ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar) పిలిచారంటే..

సాయిపల్లవి (Sai Pallavi) పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆ పేరుకి ప్రత్యేక అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇటీవల ఓ ఈవెంట్‌లో సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అంటూ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ (Sukumar) పిలిచారంటే.. ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ నటి, తిరుగులేని డ్యాన్సర్ ఎవరయ్యా అంటే.. అందరూ చెప్పే పేరు సాయిపల్లవే. చేసింది చాలా తక్కువ చిత్రాలే అయినా.. ఆ చిత్రాలతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని ఆమె సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘విరాటపర్వం’ (Virata Parvam) చిత్రం విడుదలకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉన్న సాయిపల్లవి.. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే (Open Heart With RK) కార్యక్రమంలో పాల్గొని.. ఇప్పటి వరకు తన గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో..
* అమ్మనాన్న వాళ్లు నన్ను అడుగుతున్నారు.. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? అని. ఎందుకంటే.. మేము మాట్లాడుకునే సమయంలో నేను తెలుగులో మాట్లాడేస్తున్నాను.
* 23 ఏళ్ల వయసులో పెళ్లి అయిపోతుందని, 30 సంవత్సరాలు వచ్చేసరికి నాకు ఇద్దరు పిల్లలు ఉంటారని అనుకున్నాను.
* పాలను ప్రసాదంగా ఇచ్చి, ఆశీర్వదించి.. పుట్టపర్తి సాయిబాబాగారు నాకు పేరు పెట్టారు. బాబాకి భక్తురాలిని.
* నాకు ఏదైనా నచ్చకపోతే.. నేను ఆ దారిలో వెళ్లను. సినిమా ఇండస్ట్రీ కనుక నచ్చకపోతే.. కామ్‌గా వెళ్లి చదువుకునేదాన్ని.
* పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు అని నేను అనడం లేదు. నన్ను చూసే విధానం ఎప్పుడైతే మారిందో.. అప్పుడే నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
* చిరంజీవిగారి ‘ముఠామేస్త్రి’ సినిమాలోని ఓయిరబ్బా పాటలో వేసే స్టెప్పు ఎన్నిసార్లు ట్రై చేశానో. అలాగే ‘హిట్లర్’ సినిమాలోని నడక కలిసిన నవరాత్రి పాటలోని స్టెప్ కూడా చాలా ఇష్టం. గ్రేస్ అంటే చిరంజీవిగారిదే.
* ‘ఫిదా’ నుండి ఇప్పటి వరకు అన్ని సినిమాలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నాను.
* ఇప్పుడు నేను ఏదైనా కొనాలన్నా కూడా.. ఓటీపీ అమ్మ ఫోన్‌కే వెళుతుంది...(Open Heart With RK) అంటూ ఎన్నో విషయాలను సాయిపల్లవి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫుల్ వీడియో ఈ ఆదివారం రాత్రి ABN ఆంధ్రజ్యోతి ఛానల్‌లో గం. 8.30 ని.లకు ప్రసారమవుతుంది.