Saipallavi 'Gargi': ఒక్కరోజులో జీవితం తలకిందులైపోయింది

ABN , First Publish Date - 2022-07-08T01:03:10+05:30 IST

లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai pallavi)నటించిన ‘గార్గి’ (gargi) చిత్రం ట్రైలర్‌ను నాని, దగ్గుబాటి రానా గురువారం సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. తమిళ ట్రైలర్‌ను సూర్య,(Surya) ఆర్య, అనిరుద్‌, లోకేశ్‌ కనగరాజ్‌ విడుదల చేసు సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు.

Saipallavi 'Gargi': ఒక్కరోజులో జీవితం తలకిందులైపోయింది

లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి (Sai pallavi)నటించిన ‘గార్గి’ (gargi) చిత్రం ట్రైలర్‌ను నాని, దగ్గుబాటి రానా గురువారం సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు. తమిళ ట్రైలర్‌ను సూర్య,(Surya) ఆర్య, అనిరుద్‌, లోకేశ్‌ కనగరాజ్‌ విడుదల చేసు సినిమా సక్సెస్‌ కావాలని ఆకాంక్షించారు. గౌతమ్‌ రామచ్రంద దర్శకత్వం వహించిన ఈ సినిమాను రానా సమర్పిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. న్యాయం కోసం పోరాడే యువతిగా సాయిపల్లవి నటిస్తున్నారు. న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆసక్తిగా సాగింది. (Gargi movie releasing on 15 july)


‘ఒక్క రోజులో మా జీవితాలు తలకిందులైపోయాయి అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు..

నువ్వు.. టైమ్‌, రాత, విధి అన్ని నమ్ముతావ్‌ అమ్మా... నన్ను మాత్రం నమ్మవు.. 

ఎందుకంటే నేను అబ్బాయిని కాదు కదా' అంటూ సాయి పల్లవి భావోద్వేగంగా చెప్పిన డైలాగ్‌లు ఆసక్తికరంగా సాగాయి. (Sai pallavi trailer)





Updated Date - 2022-07-08T01:03:10+05:30 IST