సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘సదా నన్ను నడిపే’ ప్రేమకథ

ABN, First Publish Date - 2022-03-02T07:36:46+05:30

లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్థన్‌ కథానాయిక...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంకా ప్రతీక్‌ ప్రేమ్‌ కుమార్‌ కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘సదా నన్ను నడిపే’. వైష్ణవి పట్వర్థన్‌ కథానాయిక. లంకా కరుణాకర్‌ దాస్‌ నిర్మాత. షూటింగ్‌ పూర్తయింది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ హోం మంత్రి మహ్మద్‌ అలీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘చిత్రసీమకు అన్ని విధాలా అనుకూలమైన వాతావరణం హైదరాబాద్‌లో ఉంది. ఐదేళ్లలో బాలీవుడ్‌ స్థాయిలోకి వెళ్లబోతోంది. చిత్రసీమకు ఏదో చేయాలన్న తపనతో కేసీఆర్‌ పని చేస్తున్నార’’న్నారు. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘గీతాంజలి తరహాలో ఇదో చక్కటి ప్రేమకథ. రొమాన్స్‌ ఉంటుంది కానీ, ఎక్కడా అసభ్యత కనిపించదు. కుటుంబం మొత్తం చూసేలా తీర్చిదిద్దామ’’న్నారు. ‘‘కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటన్నింటినీ అధిగమించి ఈ చిత్రాన్ని పూర్తి చేశామ’’ని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి ప్రభు సంగీతం అందించారు.


Updated Date - 2022-03-02T07:36:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!