Buchibabu: నేర్చుకోవడం.. తీసుకోవడమే తప్ప.. ఆయనకి ఇచ్చేంత లేదు!
ABN , First Publish Date - 2022-07-28T22:50:30+05:30 IST
తొలి చిత్రం ‘ఉప్పెన’(Uppena)తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యారు సానా బుచ్చిబాబు(Saana buchibabu). సున్నితమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ఎంతగా ఘనవిజయం సాధించిందో తెలిసిందే! అయితే ఇప్పుడాయన రెండో సినిమా పనుల్లో పడ్డారు.
తొలి చిత్రం ‘ఉప్పెన’(Uppena)తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యారు సానా బుచ్చిబాబు(Saana buchibabu). సున్నితమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ఎంతగా ఘనవిజయం సాధించిందో తెలిసిందే! అయితే ఇప్పుడాయన రెండో సినిమా పనుల్లో పడ్డారు. ఈ మధ్యనే బుచ్చి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు(NTR) ఓ కథ వినిపించారని, ఆ కథలో చిన్న చిన్న మార్పులు ఎన్టీఆర్ సూచించారని ప్రస్తుతం బుచ్చిబాబు మార్పులు, చేర్పుల పనిలో పడ్డారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా బుచ్చిబాబు కారణంగానే ఆయన గురువు సుకుమార్ తెరకెక్కించాల్సిన ‘పుష్ప2’ (Pushpa 2)ఆలస్యమవుతుందనే వార్తలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ‘పుష్ప’ సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకున్న సుక్కూ ఆ చిత్రానికి మించి ‘పుష్ప 2’ ఉండాలని తీవ్రంగా కృషి చేస్తున్నారని వినికిడి. ఆ పనుల్లో తలమునకలై ఉన్న సుకుమార్ మరో బాధ్యతను కూడా తీసుకున్నారు. బుచ్చిబాబు రెండో కథ కరెక్షన్ పనుల్లో కూడా సుకుమార్ హ్యాండ్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్‌కు బుచ్చి వినిపించిన కథను రిపేర్ చేసే పనిలో ఉన్నారు సుకుమార్. అందుకే ‘పుష్ప –2’ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ఈ మేరకు బుచ్చిబాబు తాజాగా ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. సుకుమార్‌తో చర్చల్లో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఈ ఫొటో నా తదుపరి చిత్రం కథా చర్చల్లో మా గురువు సుకుమార్తోగారితో చర్చిస్తున్న సందర్భంలోనిది. నా సినిమా కథ కోసం సాయం చేయడానికి వచ్చారు. అంతే కాని సుకుమార్ సర్ కథలో కూర్చుని చర్చలు జరిపే స్థాయి నాకు లేదు. రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు’’ అని బుచ్చిబాబు ట్విట్టర్లో రాసుకొచ్చారు. ‘పుష్ప2’ కథకు బుచ్చిబాబు కూడా వర్క్ చేస్తున్నాడు అని గుసగుసలాడుకోవడం వల్ల బుచ్చిబాబు ఈ ఫొటోతో క్లారిటీ ఇచ్చినట్లు అనిపిస్తోంది. (buchibabu about sukumar)