Saakini-Daakini: యాక్షన్, కామెడీతో ఆకట్టుకుంటున్న టీజర్..

ABN , First Publish Date - 2022-08-23T19:15:33+05:30 IST

నివేతా థాయస్ (Nivetha Thomas), రెజీనా కసాండ్రా (Regina Cassandra) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'శాకిని - డాకిని' (Saakini-Daakini).

Saakini-Daakini: యాక్షన్, కామెడీతో ఆకట్టుకుంటున్న టీజర్..

నివేతా థాయస్ (Nivetha Thomas), రెజీనా కసాండ్రా (Regina Cassandra) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ 'శాకిని - డాకిని' (Saakini-Daakini). తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహించారు. 'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ సినిమా ఆధారంగా శాకిని - డాకిని చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. పోలీస్ అకాడమీలోకి శిక్షణ కోసం ప్రవేశించిన ఇద్దరు అమ్మాయిలు తమ చిల్లర చేష్టలు..చిలిపి అల్లరితో ఎలాంటి హంగామా చేశారు? .. దాంతో అకాడమీ నుంచి ఎలా బయటికి వచ్చారు..? అనే నేపథ్యంలో తెరకెక్కించారు.


ఈ సినిమా టీజర్‌ని తాజాగా విడుదల చేశారు. రెజీనా, నివేదా పోలీస్ అకాడమీలో ట్రైనర్స్‌గా కనిపిస్తున్నారు. ట్రైనింగ్‌లో ప్రతీ విషయంలోనూ ఈ ఇద్దరు ఫెయిల్ అవుతూ తిట్లు తింటుంటారు. అంతేకాదు, ఒక  దశలో పోలీస్ అకాడమీ నుంచి తప్పించుకుంటారు. ఆ తర్వాత వీరికి అనుకోని సంఘటనలు ఎదురవుతున్నట్టుగా తాజా టీజర్‌లో చూపించారు. ఇది మాత్రమే కాకుండా ఓ సైకో వీరిని వెంబడించడం.. ఓ యువతిని దారుణంగా హింసిస్తున్న దృశ్యాలను చూపించి ఆసక్తిని రేపారు. ఇక నివేతా - రెజీనాల మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా బాగా ఆకట్టుకోనున్నట్టు తెలుస్తోంది.


మొత్తంగా చూస్తే శాకిని - డాకిని చిత్ర కథలో కామెడీ, యాక్షన్ అండ్ థిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యూన్ వూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సెప్టెంబర్ 16న విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇటీవల కాలంలో హీరోయిన్ గా అటు నివేతా థామస్, ఇటు రెజీనా కసాండ్రలకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. చూడాలి మరి ఈ సినిమాతో హిట్ అందుకొని మళ్ళీ ఫాంలోకి వస్తారేమో.



Updated Date - 2022-08-23T19:15:33+05:30 IST