ఊహకందని మలుపులతో ఉత్కంఠగా...
ABN, First Publish Date - 2022-12-28T02:41:40+05:30
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎస్ 5 నో ఎగ్జిట్’. భరత్ కోమలపాటి దర్శకత్వంలో ఆదూరి ప్రతాప్‌రెడ్డి, దేవు శామ్యూల్ తదితరులు నిర్మించారు.
తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఎస్ 5 నో ఎగ్జిట్’. భరత్ కోమలపాటి దర్శకత్వంలో ఆదూరి ప్రతాప్‌రెడ్డి, దేవు శామ్యూల్ తదితరులు నిర్మించారు. హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన చిత్రం ఇది. ఈ నెల 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు సినిమా విశేషాలను పంచుకున్నారు.
భరత్ కోమలపాటి మాట్లాడుతూ ‘హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే ట్రైన్‌లో ఓ బోగీలో మంటలు రేగుతాయి. అసలా అగ్నిప్రమాదం ఎందుకు జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఊహకందని మలుపులతో కథ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. అలీ, సునీల్ పాత్రలు ఆకట్టుకుంటాయి’ అన్నారు.
గౌతమ్ కొండెంపూడి మాట్లాడుతూ ‘భరత్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. పేరున్న నటులతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించాం. మణిశర్మ సంగీతం, గరుడ వేగ అంజి సినిమాటోగ్రఫీ మా సినిమాక బలం. 200కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’ అన్నారు.