Godfather: ఈసారి లీక్ చేసింది చిరు కాదు.. థమన్!

ABN , First Publish Date - 2022-06-19T02:48:37+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈ మధ్య సంతోషంలో.. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను.. ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించిన కీలక విషయాలను రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ (Acharya) సినిమా టైటిల్ విషయంలోనూ, బాబీ (Bobby)తో చేస్తున్న..

Godfather: ఈసారి లీక్ చేసింది చిరు కాదు.. థమన్!

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) ఈ మధ్య సంతోషంలో.. రహస్యంగా ఉంచాల్సిన విషయాలను.. ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించిన కీలక విషయాలను రివీల్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘ఆచార్య’ (Acharya) సినిమా టైటిల్ విషయంలోనూ, బాబీ (Bobby)తో చేస్తున్న సినిమా టైటిల్ విషయంలోనూ, అలాగే తను సినిమాలు చేస్తున్న డైరెక్టర్ల పేర్లు.. ఇలా ముందే చిరు అన్నీ చెప్పేస్తున్నారు. ‘నేను ఈ మధ్య అన్నీ ముందే.. నాకు తెలియకుండానే చెప్పేస్తున్నా’నంటూ.. ఇటీవల ఓ వేడుకలో కూడా చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు చిరు సినిమా నుంచి మరో లీక్ వచ్చింది. అయితే ఈసారి లీక్ చేసింది మెగాస్టార్ కాదు.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ (S Thaman). 


చిరంజీవి హీరోగా మోహన్ రాజా (Mohan Raja) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాడ్‌ఫాదర్’ (Godfather). ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించి.. టైటిల్ పోస్టర్ మినహా ఇంకా ఎటువంటి అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేయలేదు. ఈ సినిమాలో నటించే నటీనటులకు సంబంధించి కొన్ని పేర్లు బయటికి వచ్చాయి కానీ.. వారు ఏ పాత్రలు ధరిస్తున్నారనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ‘ఆహా’ (Aha) ఓటీటీలో జరిగిన ఇండియన్ ఐడియల్ తెలుగు (Indian Idol Telugu) మెగా ఫినాలే ఎపిసోడ్‌లో థమన్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని లీక్ చేశారు. 


ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నయనతార (Nayanthara) నటిస్తుందని, వారిద్దరి మధ్య ఓ పాట కూడా ఉంటుందని.. ఆ పాటని ఇండియన్ ఐడియల్ తెలుగులో మూడవ స్థానంలో నిలిచిన వైష్ణవి (Vaishnavi) పాడుతుందని థమన్ వెల్లడించారు. ఈ ప్రకటన ఆయన మెగాస్టార్ చిరంజీవి సమక్షంలోనే చేయడం విశేషం. దీంతో.. ఈ చిత్రంలో చిరంజీవి, నయనతారల మధ్య ఉన్న బంధంపై వినిపించిన ఊహాగానాలు కాస్తా నిజమయ్యాయి. ప్రస్తుతం థమన్ చేసిన ఈ ప్రకటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాభిమానులు ఈ ప్రకటనపై  రకరకాలుగా స్పందిస్తున్నారు.



Updated Date - 2022-06-19T02:48:37+05:30 IST