రుద్రుడు వస్తున్నాడు
ABN , First Publish Date - 2022-07-04T07:18:34+05:30 IST
లారెన్స్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్.. ఇట్ ఈజ్ క్రియేటెడ్ అనేది ఉపశీర్షిక...
లారెన్స్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్.. ఇట్ ఈజ్ క్రియేటెడ్ అనేది ఉపశీర్షిక. ప్రియ భవానీ శంకర్ కథానాయిక. శరత్ కుమార్ కీలక పాత్రధారి. కతిరేశన్ దర్శక నిర్మాత. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ‘రుద్రుడు’ నంచి ఓ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో లారెన్స్ లుక్ మాసీగా ఉంది. ‘‘మాస్కి నచ్చే సినిమా ఇది. బలమైన కథ కుదిరింది. లారెన్స్ నుంచి ఎలాంటి అంశాలు ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయ’’న్నారు దర్శకుడు. పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు నటించిన ఈ చిత్కానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్.