అఫీషియల్: ఆర్‌ఆర్‌ఆర్ విడుదల తేదీ ఇదే!
ABN , First Publish Date - 2022-01-31T23:46:23+05:30 IST
సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల ఇచ్చిన ప్రకటనలో మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్ ఫైనల్ డేట్‌ను సోమవారం ప్రకటించారు. మార్చి 25న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది.

సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కొత్త విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల ఇచ్చిన ప్రకటనలో మార్చి 18 లేదా ఏప్రిల్ 28న సినిమాను విడుదల చేస్తామని చెప్పిన మేకర్స్ ఫైనల్ డేట్‌ను సోమవారం ప్రకటించారు. మార్చి 25న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కావాల్సి ఉంది. దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు రాజమౌళి అండ్ టీమ్ పూర్తి చేశారు. కోట్లు ఖర్చు చేసి ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేశారు. కరోనా ఉదృతి పెరగడం, నిబంధనలు అమలులోకి రావడం వల్ల జనవరి 7న కూడా సినిమా విడుదల కాలేదు. తాజా ప్రకటనతో ఎన్టీఆర్, చరణ్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియాభట్ ఒలివియా మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు.