ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌: రూట్‌ మ్యాప్‌ ఇదే!

ABN , First Publish Date - 2022-03-17T23:58:00+05:30 IST

రాజమౌళికి ప్రమోషన్‌ ఎత్తుగడ బాగా తెలుసు. సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తైతే.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఇవన్నీ ఆయనకు కొట్టిన పిండిలాంటివే. అయితే ప్యాన్‌ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం ఆషామాషీ కాదు. విడుదల చేసే ప్రతి ప్రాంతంలోనూ మీడియాతో ఇంటరాక్ట్‌ కావాలి. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలి. దాని వెనుక ఎంతో ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు అదే పనిలో నిమిగ్నమై ఉంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం.

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌: రూట్‌ మ్యాప్‌ ఇదే!

6 రోజుల్లో 9 నగరాల్లో ప్రచారం...

దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ ఈవెంట్లు 

రాజమౌళికి ప్రమోషన్‌ ఎత్తుగడ బాగా తెలుసు. సినిమాను తెరకెక్కించడం ఒక ఎత్తైతే.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ఇవన్నీ ఆయనకు కొట్టిన పిండిలాంటివే. అయితే ప్యాన్‌ ఇండియా స్థాయి చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం ఆషామాషీ కాదు. విడుదల చేసే ప్రతి ప్రాంతంలోనూ మీడియాతో ఇంటరాక్ట్‌ కావాలి. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలి. దాని వెనుక ఎంతో ప్రణాళిక ఉండాలి. ఇప్పుడు అదే పనిలో నిమిగ్నమై ఉంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం. ఇప్పటికే చెన్నై, ముంబయి, కేరళ, హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్లు, మీడియా ఇంటరాక్షన్‌ నిర్వహించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్‌ ఇంకాస్త ముమ్మరం చేశారు. 6 రోజుల సమయంలో 9 ప్రధాన నగరాల్లోని సినీ ప్రియుల్ని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ బృందం కలవబోతోంది. దీనికి సంబంధించిన ప్రమోషన్‌ రూట్‌ మ్యాప్‌ను రాజమౌళి విడుదల చేశారు. ఆ వివరాలు... 


ప్రచారం నిర్వహించే ప్రాంతాల వివరాలు: 


18–03–2022: దుబాయ్‌


19–03–2022: బెంగళూరు


20–03–2022: బరోడా, ఢిల్లీ


21–03–2022: అమృత్‌సర్‌, జైపుర్‌


22–03–2022: కోల్‌కతా, వారణాసి


23–03–2022: హైదరాబాద్‌.


ఈ విధంగా రాజమౌళి వివిధ ప్రాంతాల్లో ప్రమోషన్‌ ఈవెంట్స్‌ ప్లాన్‌ చేశారు. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మించిన చిత్రమిది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ కీలక పాత్రల్లో కనిపిస్తారు. 


Updated Date - 2022-03-17T23:58:00+05:30 IST

Read more