ఆల్‌ఇండియా రికార్డు సెట్ చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’

ABN , First Publish Date - 2022-04-03T19:13:08+05:30 IST

దర్శక ధీరుడు రాజమౌళి మలిచిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం మొదటి రోజు నుంచీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని.. వరుసగా రికార్డుల్ని బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. సినిమా విడుదలై ఇప్పటి తొమ్మిది రోజులైనప్పటికీ.. కలెక్షన్స్ లో దూకుడును ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి రికార్డ్ స్థాయిలో రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరుస్తోంది. మరికొద్ది రోజుల పాటు ఇదే స్థాయిలో కలెక్షన్స్ కొనసాగితే.. రూ. 1000 కోట్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లోనూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా మరో అరుదైన రికార్డు ను సొంతం చేసుకోవడం విశేషం. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం తాజాగా బుక్ మై షో లో ఆల్ ఇండియా రికార్డులన్నీ బద్దలు కొట్టి సరికొత్త రికార్డు ను సెట్ చేసింది. ఇప్పటి వరకూ 571 కె కి పైగా ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి రేటింగ్ ఇవ్వడం విశేషం. ఏ సినిమాకైనా ఇదే హైయస్ట్ అని చెప్పాలి. 90 శాతం మంచి రేటింగ్ సాధించి ఈ సినిమా టాప్ లో దూసుకుపోతోంది. 

Updated Date - 2022-04-03T19:13:08+05:30 IST

Read more