కెనడాలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-11-02T10:05:14+05:30 IST

ప్రముఖ నటి రంభ రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో సహా కెనడాలో ఉంటున్నారు...

కెనడాలో రోడ్డు ప్రమాదం

స్వల్ప గాయాలతో బయటపడిన రంభ

ప్రముఖ నటి రంభ రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో సహా కెనడాలో ఉంటున్నారు. భారతకాలమాన ప్రకారం సోమవారం సాయింత్రం రంభ స్కూలు నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రంభ ప్రయాణిస్తున్న కారుని మరో కారు ఢీ కొట్టుకోవడంతో ఆమెతో పాటు కుమార్తె నషా గాయాల పాలయ్యారు. ఆ సమయంలో కారులో రంభ, ఆమె పిల్లలతో పాటు వ్యక్తిగత సహాయకురాలు కూడా ఉన్నారు. నషా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన విషయాన్ని రంభ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొన్నారు. సమయానికి ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. 


Updated Date - 2022-11-02T10:05:14+05:30 IST

Read more