Biggboss: ఇద్దరికీ ఒకే లాలీపాప్‌.. నాగ్‌ ఏమంటారో..

ABN , First Publish Date - 2022-10-14T22:57:18+05:30 IST

‘‘ఒరేయ్‌ ఈ ప్లేట్‌ తీసుకుని ఇద్దరూ టేబుల్‌ కిందకి వెళ్లిపోండిరా. సిగ్గుండాలి.. యుద్థం కూడా ఆరు తరువాత ఆపేస్తారు. నువ్వేంట్రా.. పొద్దున్నలేచింది మొదలు దాని మీద దాడి చేత్తానే ఉన్నావ్‌ ఏదో మూల!

Biggboss: ఇద్దరికీ ఒకే లాలీపాప్‌.. నాగ్‌ ఏమంటారో..

‘‘ఒరేయ్‌ (Inaya-surya romance)ఈ ప్లేట్‌ తీసుకుని ఇద్దరూ టేబుల్‌ కిందకి వెళ్లిపోండిరా. సిగ్గుండాలి.. యుద్థం కూడా ఆరు తరువాత ఆపేస్తారు. నువ్వేంట్రా.. పొద్దున్నలేచింది మొదలు దాని మీద దాడి చేత్తానే ఉన్నావ్‌ ఏదో మూల!  ఇంత మంది ఇక్కడ ఉంటే.. దాని కాలిని తెగ తొక్కేస్తున్నావ్‌.. జనాలంతా వీడిలో ఇంత విషయం ఉందా అనుకోవాలనా’’ ప్రతిరోజు పండగే చిత్రంలో రావు రమేశ్‌ భద్రంపై పేల్చిన డైలాగ్‌లివి. ఇప్పుడు ఇవే డైలాగ్‌లు బిగ్‌బాస్‌ హౌస్‌లో సూర్య.. ఇనాయాలకు అన్వయిస్తున్నారు నెటిజన్లు. (Biggboss 6)


ఎందుకంటే హౌస్‌లో వీరిద్దరి మధ్య అంతగా రొమాన్స్‌ నడుస్తోంది. స్టోర్‌ రూమ్‌ నుంచి ఏ మూలన చూసినా ఈ జంటే కనిపిస్తున్నారు. ఒకే ప్రేమ్‌లో ఈ జంట ఉందీ అంటే.. ఐతే.. హగ్గు.. లేదా ముద్దు.. ఇంకా అంటే ఒళ్లో తలపెట్టుకోవడం..ఇదే తంతు. గత ఎలిమినేషన్స్‌లో వీరిద్దరి మధ్య ఉన్న క్రష్‌ను నాగార్జున బయటపెట్టారు. అప్పటి నుంచి ఇంకా శ్రుతి మించి ప్రవర్తిస్తున్నారు. ఆరోహి ఇంట్లో ఉన్నంత సేపు ఆమెతో కలిపిన పులిహోర చాలదు అన్నట్లు.. ఇప్పుడు ఇనాయాపై దృష్టిపెట్టాడు ఆర్జే సూర్య. పెళ్లి కాకుండానే లైసెన్స్‌ ఇచ్చి.. కాపురం పెట్టించినట్టు ఉంది వీరి పరిస్థితి. వీరిద్దరూ ఎవరి చేత్తో వారు తిని వారం కావొస్తుంది. ఒకరికొకరు తినిపించుకుంటూ కనిపిస్తున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉండడంతోపాటు ఆమె ఒళ్లో ఇతని తల పెట్టుకోవడం ఇదే బిగ్‌బాస్‌ స్ర్కీన్‌పై కనిపిస్తోంది. తాజాగా ఇనయా–సూర్య మధ్య సాగిన ఓ ఎపిసోడ్‌ నెటిజన్‌లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అలాగే ట్రోలింగ్‌కు కూడా గురి చేసింది. వీరిద్దరూ హౌస్‌లో ఇరుకైన ప్రదేశానికి వెళ్లి ఉన్న ఇరుకేౖన ప్లేస్‌లోకి దూరిపోయారు.. ఎవరికీ కనిపించకుండా ఓ చోట పడుకొని ఇనయా లాలీపాప్‌ తినడం.. అదే లాలీపాప్‌ను ప్రేమగా సూర్యకు తినిపించడం. దానిని అతను చప్పరించడం, ఆమె కూడా అదే చేయడం.. ఈ వేషాలను చూసిన నెటిజన్‌లు ఇనాయ–సూర్యలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


ఇది చూసిన ఆడియన్స్‌ ఆటైనా, మరొకటి అయిన ఓ పద్దతి, విధానం ఉంటుంది. వీరిద్దరూ శ్రుతిమించుతున్నారు. సీపీఐ నారాయణ అన్నట్లు ఇది బిగ్‌బాస్‌ ఇల్లా లేక బ్రోతల్‌ హౌసా అని ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి జంట కామక్రీడల గురించి వారాంతంలో నాగార్జున ఏమంటారో చూడాలి. 

 


Updated Date - 2022-10-14T22:57:18+05:30 IST