Kantara: ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
ABN, First Publish Date - 2022-11-17T23:42:07+05:30
కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). రిషబే దర్శకత్వం వహించాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన సినిమా ‘కాంతార’ (Kantara). రిషబే దర్శకత్వం వహించాడు. హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఈ సినిమా ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా రూ.400కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ సినిమాను థియేటర్‌లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకుల ఎదురు చూపులకు తెరపడినట్టే తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం అందుతుంది.
‘కాంతార’ ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. ఈ సినిమా నవంబర్ 24 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా తెలపనుంది. గతంలో ఈ చిత్రం నవంబర్ 4న, నవంబర్ 18న స్ట్రీమింగ్ అవుతుందని రూమర్స్ హల్‌చల్ చేశాయి. కానీ, ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రాణిస్తుండటంతో మేకర్స్ పలు మార్లు స్ట్రీమింగ్ డేట్‌ను మార్చారు. కాంతార సినిమా విడుదలైనప్పటి నుంచి రికార్డులను క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకుంది. కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ మూవీకి సంబంధించి కన్నడ నాట కోటి టిక్కెట్స్ అమ్ముడయ్యాయి. ఐఏమ్‌డీబీలోను అత్యధిక రేటింగ్‌ను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఐఏమ్‌డీబీ రేటింగ్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్ 2’ లను బీట్ చేసింది. ఈ చిత్రంపై అనేక మంది సెలబ్రిటీలు ప్రశసంల వర్షం కురిపించారు. రజినీకాంత్, రామ్ గోపాల్ వర్మ, ప్రభాస్, పూజా హెగ్డే, శిల్పా శెట్టి తదితరులు ఈ మూవీని పొగిడారు.