‘అల్లు’నే కొత్త మెగా హీరో: ఆర్జీవీ
ABN , First Publish Date - 2022-01-18T22:40:01+05:30 IST
తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టార్డమ్ మీద రామ్‌గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ‘‘ఇప్పుడు ‘అల్లు’నే కొత్త మెగా హీరో. ఇది వినడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇదే నిజం’’ అంటూ ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాశంమైంది. అయితే వర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్స్ చేశారో తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పుడు అభిమానుల్లో గందరగోళం మొదలైంది.

అలాగే సెలబ్రిటీల విడాకులపై కూడా ఆయన స్పందించారు. వివాహబంధం గురించి వరుస ట్వీట్లు చేశారు. తెలివైన వ్యక్తులే ప్రేమిస్తారని, అమాయకులు పెళ్లి చేసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘స్టార్ల విడాకులు ఈ మఽధ్యకాలంలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలుస్తున్నాయి. పెళ్లి ఎంత ప్రమాదకరమో యూత్‌కు తెలిపే హెచ్చరికలివి. ఈ కాలంలో పెళ్లి వేడుకలు ఘనంగా జరిగినన్న రోజులు కూడా బంధాలు నిలవట్లేదు. మూడు నుంచి ఐదు రోజుల్లో తెగిపోతున్నాయి. విడాకులతో పెళ్లి బంధం నుంచి విముక్తి పొందిన వారే సంగీత్ వేడుకలు నిర్వహించుకోవాలి. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా, అది ఉన్నంత వరకూ ప్రేమించుకుంటూ వెళ్లడమే మంచిది. నిజాయతీ ఉన్న వాళ్లని జనాలు అసహ్యించుకుంటున్నారు. చెడ్డవాళ్లను మాత్రం ప్రేమిస్తున్నారు’’ అంటూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం వర్మ ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.