సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కొడాలి నానిపై ఆర్జీవీ సెటైరికల్ ట్వీట్స్..

ABN, First Publish Date - 2022-01-19T17:08:25+05:30

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై సెటైరికల్‌గా ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని నియోజకవర్గం అయిన కృష్ణా జిల్లా గుడివాడలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై సెటైరికల్‌గా ట్వీట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని నియోజకవర్గం అయిన కృష్ణా జిల్లా గుడివాడలో.. సంక్రాంతి పండుగ రోజుల్లో జూదశాల నిర్వహణ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. క్యాసినో, జూదం, పేకాట, అమ్మాయిలు, అసభ్యకర నృత్యాలు.. వంటి అసాంఘిక కార్యకలాపాలు జగుతున్నాయని తెలుగు దేశం నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, గోవా రాష్ట్రాన్ని తలపించేలా గుడివాడలో ఈ వ్యవహారం సాగుతోందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాం గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొడాలి నానిపై కామెంట్స్ చేశారు. "గుడివాడను లండన్, పారిస్, లాస్ వెగాస్‌ల సరసన నిలిపారు. గుడివాడ ప్రజలు గోవాకు వెళ్లిన ఫీలింగ్‌ను నాని కల్పించారు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు వర్మ. 






Updated Date - 2022-01-19T17:08:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!