‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో రేణు దేశాయ్

ABN , First Publish Date - 2022-04-03T00:00:43+05:30 IST

‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో మళ్లీ రేణు దేశాయ్ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చాలా గ్యాప్ తర్వాత ‘ఆద్య’ అనే వెబ్ సిరీస్‌లో ఆమె నటించారు. ఇప్పుడు వెండితెరపై కూడా మరోసారి తన ప్రతిభను కనబరిచేందుకు

‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో రేణు దేశాయ్

‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంతో మళ్లీ రేణు దేశాయ్ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చాలా గ్యాప్ తర్వాత ‘ఆద్య’ అనే వెబ్ సిరీస్‌లో ఆమె నటించారు. ఇప్పుడు వెండితెరపై కూడా మరోసారి తన ప్రతిభను కనబరిచేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని శుభకృత్ నామ సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకుని నేడు(శనివారం) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై.. హీరో ర‌వితేజ‌, హీరోయిన్లు నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌ల‌పై చిత్రీక‌రించిన ముహూర్త‌పు షాట్‌కు క్లాప్ కొట్టారు. ఈ వేడుకకు రేణు దేశాయ్ కూడా హాజరవడంతో.. ఆమె కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారనే విషయం వెల్లడైంది. 


ఈ కార్యక్రమంలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు వంశీ 2019లో ఈ సినిమా క‌థ‌లోని పాత్ర గురించి చెప్పారు. ఆ సమయంలో మ‌ర‌లా తెరపై క‌నిపించాలనే ఆలోచ‌న‌లేదు. కానీ పాత్ర బాగా న‌చ్చ‌డంతో చేయాల‌నే ఉత్సాహం క‌లిగింది. ద‌ర్శ‌కుడు వంశీ నాపై పూర్తి న‌మ్మ‌కంగా ఉన్నారు. ఈ చిత్రంలో నా పాత్రని చాలా బాగా తీర్చిదిద్దారు. ఇండియాలో గొప్ప ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకుంటాడ‌నే న‌మ్మ‌క‌ముంది’’ అని తెలిపారు. కాగా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.Updated Date - 2022-04-03T00:00:43+05:30 IST

Read more