దాసరిని స్మరించుకొంటూ..

ABN , First Publish Date - 2022-06-01T11:05:54+05:30 IST

దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘దాసరి స్మారక పురస్కారాలు’ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో...

దాసరిని స్మరించుకొంటూ..

దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘దాసరి స్మారక పురస్కారాలు’ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో అట్టహాసంగా సాగింది. వివిధ రంగాలలో విశిష్టమైన సేవలు అందించిన ప్రముఖులకు భారత్‌ అకాడమీ, వాసవి ఫిల్మ్‌ అవార్డ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ పురస్కారాల్ని ప్రదానం చేశారు. నటి దివ్యవాణి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యండమూరి వీరేంద్రనాథ్‌, రోజా రమణి, చక్రపాణి, సుమన్‌, సాగర్‌, రాజా వన్నెంరెడ్డి, విష్ణు బొప్పన, ధీరజ అప్పాజీ తదితరులు ఈ అవార్డులు అందుకొన్నారు. 


Updated Date - 2022-06-01T11:05:54+05:30 IST

Read more