సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Regina cassandra: ఇక ఆ అవకాశం లేదు!

ABN, First Publish Date - 2022-09-09T23:30:20+05:30

టాలీవుడ్‌లో ఓ యువహీరోతో ప్రేమాయణానికి బ్రేక్‌ పడిన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చారు రెజీనా కసాండ్రా. ప్రేమ వ్యవహారం మిగిల్చిన చేదు అనుభవం నుంచి బయటకు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లో ఓ యువహీరోతో ప్రేమాయణానికి  బ్రేక్‌ పడిన తర్వాత సినిమాలకు కొంత గ్యాప్‌ ఇచ్చారు రెజీనా కసాండ్రా(Regina cassandra). ప్రేమ వ్యవహారం మిగిల్చిన చేదు అనుభవం నుంచి బయటకు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఈ విషయాన్ని రెజీనా పలు సందర్భాల్లో చెప్పింది. గతాన్ని గుర్తు చేసుకుంటే ముందడుగు వేయలేం అని కూడా చెప్పింది. తాజాగా మరోసారి రెజీనా పెళ్లి ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్‌ కావడంతో రెజీనా తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. 2020లోనే ప్రేమ వ్యవహారం ముగిసిందని చెప్పింది. దాని నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టిందన్న ఆమె ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేనని తెలిపింది. ( Regina cassandra marraige rumors)


‘‘ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటానో, లేదో కూడా నాకే తెలీదు. ఎందుకంటే ఎదురువారిపై ఆధారపడకుండా ఓన్‌గా జీవించడం అనేది చిన్నతనంలోనే అమ్మ నేర్పించింది. జీవితంలో తోడు కావాలా? వద్దా? అన్ని విషయాలను కూడా ఇకపై ఆలోచించే అవకాశం లేదు’’ అని రెజీనా పేర్కొన్నారు. ‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి  సరసన ‘శానా కష్టం’ అంటూ ఆడిపాడిన రెజీనా ప్రస్తుతం శాకినీ డాకినీ’ చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మొత్తం మీద తమిళ, తెలుగు భాషల్లో మూడు సినిమాలతో బిజీగా ఉందీ చెన్నై బ్యూటీ.    


Updated Date - 2022-09-09T23:30:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!