రెడ్డిగారింట్లో రౌడీయిజం
ABN , First Publish Date - 2022-03-27T06:12:41+05:30 IST
రమణ్ హీరోగా రూపుదిద్దుకొన్న ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. కె.శిరీషారమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి...

రమణ్ హీరోగా రూపుదిద్దుకొన్న ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రం ఏప్రిల్ 8న విడుదల కానుంది. కె.శిరీషారమణారెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ఎం.రమేశ్, గోపి దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు వినోద్‌కుమార్ విలన్‌గా నటించారు. ప్రియాంక రౌరీ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి ఆదరణ లభించినట్లు దర్శకనిర్మాతలు చెప్పారు. స్ర్కీన్ మ్యాక్స్ పిక్చర్స్ సంస్థ తమ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చిత్ర హీరో రమణ్ మాట్లాడుతూ ‘ఇది పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. హైదరాబాద్, గోవా, రాయలసీమ ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ చేశాం. ఈ సినిమాతో నాకు నటుడిగా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.