సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

GodFather vs The Ghost: అందుకేనా చిరు-నాగ్ వెనక్కి తగ్గట్లేదు

ABN, First Publish Date - 2022-09-27T22:04:45+05:30

పండుగకి నాలుగైదు సినిమా విడుదలవడం అనేది కొత్త విషయం కానప్పటికీ.. ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకి మధ్య గ్యాప్ అవసరం అంటూ నిర్మాతలు కొందరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పండుగకి నాలుగైదు సినిమా విడుదలవడం అనేది కొత్త విషయం కానప్పటికీ.. ఈ మధ్య కాలంలో సినిమా సినిమాకి మధ్య గ్యాప్ అవసరం అంటూ నిర్మాతలు కొందరు రూల్స్ తెచ్చి.. క్లాష్ లేకుండా చూస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో.. ముఖ్యంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో నిర్మాతలు కొందరు సమావేశమై.. ఏ సినిమా ఎప్పుడు విడుదలకావాలో డిసైడ్ చేస్తున్నారు. కానీ, ఈ దసరాకి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు క్లాష్ అవుతున్నా.. ఆ పెద్దలు ఇంతవరకు సౌండ్ చేయలేదు. ఆ విషయం పక్కన పెడితే.. మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi), కింగ్ నాగార్జున (King Nagarjuna) ఇద్దరూ మంచి స్నేహితులనే (Friends) విషయం ఇండస్ట్రీలో ఏ ఒక్కరినీ కదిలించినా చెబుతారు. అలాంటి స్నేహితులు.. పోటీ పడుతుండటం ఏమిటా? అని ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటోంది. చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ (GodFather), నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ (The Ghost) చిత్రాలు దసరా స్పెషల్‌గా అక్టోబర్ 05న విడుదల కాబోతున్నాయి. ఈ ఫైట్ ఎవరూ ఊహించనిది. అయితే విడుదల తేదీలు ప్రకటించి చాలా కాలం అవుతున్నా.. ఈ క్లాష్‌ని ఆపడానికి ఎవరూ సాహసం కూడా చేయలేదు. అయితే ఈ క్లాష్‌కి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ కారణం వినిపిస్తోంది. ఆ కారణంగానే అటు చిరు, ఇటు నాగ్ వెనక్కి తగ్గడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. (Chitranjeevi vs Nagarjuna)


ఆ వినిపిస్తున్న కారణం ఏమిటంటే.. చిరు ‘గాడ్‌ఫాదర్’, నాగ్ ‘ది ఘోస్ట్’ చిత్రాలు దాదాపు ఒకే స్టోరీలైన్‌ (Storyline)ని కలిగి ఉండటం. ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో చిరంజీవి తన చెల్లెలి (Sister) కోసం ఫైట్ చేస్తే.. ‘ది ఘోస్ట్’ సినిమాలో కూడా సేమ్ టు సేమ్ నాగార్జున కూడా తన సోదరిని రక్షించేందుకే ఫైట్‌కి దిగుతాడనే విషయం.. తాజాగా విడుదలైన ఈ సినిమాల టీజర్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. పొలిటికల్ ట్రబుల్స్ ఫేస్ చేస్తున్న సోదరి తరపున చిరంజీవి, టెర్రరిస్ట్‌ల దాడి నుండి తన సోదరిని కాపాడేందుకు ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా నాగార్జున బరిలోకి దిగుతున్నట్లుగా టీజర్‌లో కనిపిస్తుంది. ఇలా ఇద్దరి పాత్రలు పోల్చుకునే విధంగా ఉండటంతో.. ఎవరి సినిమా ముందు రిలీజ్ అయినా.. తర్వాత విడుదలయ్యే సినిమాతో పోలికలు మొదలెడతారనే.. చిరు, నాగ్‌ (Chiru and Nag) భావిస్తున్నారని, అందుకే మిత్రులైనా కూడా ఈ విషయంలో ఇద్దరూ మాట్లాడుకునే బరిలోకి దిగుతున్నారనేలా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. (GodFather vs The Ghost)

Updated Date - 2022-09-27T22:04:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!