Raviteja : తమ్ముడి కొడుకు హీరో ఎంట్రీ.. ఫస్ట్ లుక్ ఇదే !

ABN , First Publish Date - 2022-08-09T15:09:49+05:30 IST

టాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేకుండా.. స్వశక్తితో స్టార్ హీరో అయ్యారు రవితేజ (Raviteja). వైవిధ్యమైన పాత్రలతో విలక్షణమైన నటనతో అభిమానులకు మాస్ మహారాజా అయ్యారు. జయాపజయాలతో సంబంధం లేకుండా.. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఫ్యామిలీ నుంచి ఓ నటవారసుడు వస్తున్నాడు.

Raviteja : తమ్ముడి కొడుకు హీరో ఎంట్రీ.. ఫస్ట్ లుక్ ఇదే !

టాలీవుడ్‌లో గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేకుండా.. స్వశక్తితో స్టార్ హీరో అయ్యారు రవితేజ (Raviteja). వైవిధ్యమైన పాత్రలతో విలక్షణమైన నటనతో అభిమానులకు మాస్ మహారాజా అయ్యారు. జయాపజయాలతో సంబంధం లేకుండా.. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఫ్యామిలీ నుంచి ఓ నటవారసుడు వస్తున్నాడు. అతడు రవితేజ తనయుడు మాత్రం కాదు. లాంటి వాడు. రవితేజ పెద్ద తమ్ముడు రఘు (Raghu) కొడుకు మాధవ్ (Madhav). ‘ఏయ్ పిల్లా’ (Ey Pilla) చిత్రంతో అతడి హీరో ఎంట్రీ ఖాయమైంది. దర్శకుడు రమేశ్ వర్మ కథ అందించగా.. లుధీర్ బైరెడ్డి (Luther Bireddy) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రుబల్ షెకావత్ కథానాయికగా నటిస్తోంది.  లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు బుజ్జి (Nallamalupu Bujji) ఈ సినిమాను నిర్మి్స్తున్నాడు. ‘ఏ పిల్లా’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. 


హీరోగా మాధవ్ లుక్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే కథానాయిక కూడా ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నటించడానికి ముందు హీరో మాధవ్.. డ్యాన్స్, ఫైట్స్, హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. అలాగే.. నటనకు సంబంధించిన శిక్షణను కూడా పూర్తి చేశాడు. రవితేజ తన తమ్ముళ్ళు రఘు, భరత్‌ (Bharath)లకు నటులుగా అవకాశాలిప్పించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. అందుకే తన తమ్ముడి కొడుకునైనా హీరోని చేసి వారి కుటుంబాన్ని నిలబెట్టాలనుకుంటున్నారు రవితేజ. మాధవ్ హీరోగా రావడం వెనుక రవితేజ కృషి చాలానే ఉంది. మరి ఈ సినిమాతో మాధవ్ హీరోగా ఏ స్థాయిలో మార్కులేయించుకుంటాడో చూడాలి. 



Updated Date - 2022-08-09T15:09:49+05:30 IST