సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RamaRaoగా రవితేజ డ్యూటీ ఎక్కేది ఆ రోజే!

ABN, First Publish Date - 2022-06-23T01:14:36+05:30

RamaRao On Duty: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). చిత్రీకరణ పూర్తి చేసుకుని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

RamaRao On Duty: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) హీరోగా.. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). చిత్రీకరణ పూర్తి చేసుకుని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు తెలిపారు. రామారావుగా రవితేజ డ్యూటీ ఎక్కేందుకు దాదాపు నెల సమయం ఉండటంతో.. రానున్న రోజుల్లో భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌‌కు చిత్రయూనిట్ రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. 


ఇక విడుదల తేదీని ప్రకటిస్తూ.. విడుదల చేసిన పోస్టర్ టెర్రిఫిక్‌గా వుంది. రవితేజ తీక్షణంగా ఆలోచిస్తూ సీరియస్‌గా చూస్తున్న ఇంటెన్స్ లుక్ ఆసక్తికరంగా వుంది. హై వోల్టేజ్ యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రవితేజ సరసన రజిషా విజయన్ (Rajisha Vijayan), దివ్యాంశ కౌశిక్‌ (Divyasha Kaushik) కథానాయికలుగా నటిస్తుండగా, సీనియర్ హీరో వేణు తొట్టెంపూడి (Venu Thottempudi) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సామ్ సిఎస్ (Sam CS) సంగీతం అందిస్తున్నారు.



Updated Date - 2022-06-23T01:14:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!