సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Raviteja: మాస్‌ మహారాజాతో... శ్రీవాస్‌!

ABN, First Publish Date - 2022-08-08T21:46:29+05:30

మాస్‌ మహారాజా రవితేజ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘ధమాకా’, ‘రావణాసుర’తోపాటు చిరంజీవి హీరోగా రూపొందుతున్న 154 చిత్రంలో కూడా రవితేజ నటిస్తున్నారు. ఇది కాకుండా ఆయన మరో చిత్రానికి సైన్‌ చేశారు. శ్రీవాస్‌ దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్‌ మహారాజా రవితేజ (Raviteja)వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘టైగర్‌ నాగేశ్వరరావు’, ‘ధమాకా’, ‘రావణాసుర’తోపాటు చిరంజీవి(Chiranjeevi) హీరోగా రూపొందుతున్న 154 చిత్రంలో కూడా రవితేజ నటిస్తున్నారు. ఇది కాకుండా ఆయన మరో చిత్రానికి సైన్‌ చేశారు. శ్రీవాస్‌(Sriwass) దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు. ఇటీవల రవితేజ పూర్తి కథ విన్నారని తెలిసింది. కథ నచ్చడంతో ప్రస్తుతం అతని చేతిలో ఉన్న సినిమాలను కొన్నింటిని పక్కనపెట్టి ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే పనిలో రవితేజ ఉన్నారని తెలిసింది. (Sriwass to direct Raviteja)


శ్రీవాస్‌ సినిమా అంటే యాక్షన్‌తో పాటు చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంటుంది. అయితే ఈ కథ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని సమాచారం. రాజకీయ వ్యవస్థపై సెటైరికల్‌గా సాగుతుందనే టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం శ్రీవాస్‌ మాచోస్టార్‌ గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తయ్యాక శ్రీవాస్‌ ఈ చిత్రం మొదలుపెడతారట. ఈలోపు రవితేజ కూడా ‘ధమాకా’ చిత్రం పూర్తి చేస్తారు. 


Updated Date - 2022-08-08T21:46:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!