ఫుల్ కిక్‌లో ఖిలాడి
ABN , First Publish Date - 2022-01-24T05:30:00+05:30 IST
రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు.
రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాత. ఫిబ్రవరి 11న ఈచిత్రాన్ని విడుదల చేస్తారు. జనవరి 26 రవితేజ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఖిలాడి’లోని ‘ఫుల్ కిక్కు’ అనే గీతాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రవితేజ పాత్ర అంటేనే ఎనర్జటిక్‌గా ఉంటుంది. దానికి రెండొంతుల జోష్ ‘ఖిలాడి’లో కనిపిస్తుంది. అన్ని వర్గాలనూ ఆకట్టుకునే కథ, కథనాలతో సాగే చిత్రమిది. పాటలకు మంచి స్పందన వస్తోంద’’న్నారు.