Dhamaka: ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్న రవితేజ

ABN , First Publish Date - 2022-12-08T21:17:56+05:30 IST

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja), యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka)...

Dhamaka: ఊరమాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్న రవితేజ

మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja), యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ధమాకా’ (Dhamaka). త్రినాథ్‌రావు నక్కిన (Trinadha Rao Nakkina) దర్శకత్వం వహించాడు.  ఈ చిత్రం కిస్మస్ కానుకగా డిసెంబర్ 23న విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటుంది. దీంతో ఇప్పటికే పలు పోస్టర్స్‌, పాటలు విడుదల చేశారు. దీంతో అవి సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా.. తాజాగా ఈ చిత్రం నుంచి మరో మాస్‌ సాంగ్‌ విడుదలైంది.


‘దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో’ అంటూ సాగే ఈ  ఫోక్ సాంగ్ శ్రోతలలో జోరు పెంచేలా ఉంది. భీమ్స్, సాహితి చాగంటి, మంగ్లీ ఈ పాటను ఆలపించగా..  జానీ మాస్టర్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. రవితేజ, శ్రీలీల మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకుంటున్నారు. ఈ సాంగ్ సైతం విడుదలైన కొద్దిసేపట్లోనే మంచి వ్యూస్‌ని సాధించి యూట్యూబ్‌లో దూసుకెళుతోంది. దీంతో ఎంతోమంది రవితేజ ఫ్యాన్స్‌‌తో పాటు ఇతర నటుల ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ‘అందరి హీరో ఫ్యాన్స్ ఇష్టపడే ఏకైక హీరో మన మాస్ మహారాజా రవితేజ అన్న..ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం’. ‘డ్యాన్స్, ఎనర్జీ, లిరిక్స్.. బ్లాక్ బస్టర్ సాంగ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2022-12-08T21:17:56+05:30 IST