Rashmika mandanna: ఆట ఇప్పుడే మొదలైంది!

ABN , First Publish Date - 2022-08-09T00:38:37+05:30 IST

‘‘సీతారామం’ సాధించిన విజయం నాకెంతో ప్రత్యేకం. ఈ చిత్రం కోసం టీమ్‌ అంతా రెండేళ్లపాటు కష్టపడ్డారు. క్లాసిక్‌ బ్లాక్‌ బస్టర్‌ రూపంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది’’ అని రష్మిక మందన్నా అన్నారు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకుర్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతారామం’.

Rashmika mandanna: ఆట ఇప్పుడే మొదలైంది!

అఫ్రిన్‌ యునీక్‌ క్యారెక్టర్‌..

హను వల్లే సక్సెస్‌ సాధ్యమైంది..

ఆ జోన్‌ దాటి సినిమాలు చేస్తున్నా! 

– రష్మిక మందన్నా(Rashmika mandanna)

‘‘సీతారామం’ (Seetha ramam)సాధించిన విజయం నాకెంతో ప్రత్యేకం. ఈ చిత్రం కోసం టీమ్‌ అంతా రెండేళ్లపాటు కష్టపడ్డారు. క్లాసిక్‌ బ్లాక్‌ బస్టర్‌ రూపంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది’’ అని రష్మిక మందన్నా అన్నారు.  దుల్కర్‌ సల్మాన్‌(Dulquer salman), మృణాల్‌ ఠాకుర్‌ (Mrunal takur)జంటగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సీతారామం’. అఫ్రిన్‌గా రష్మిక మందన్నా కీలక పాత్రలో మెరిశారు. వైజయంతీ మూవీస్‌, స్వప్న సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై విజయం సాధించిన నేపథ్యంలో సినిమా సక్సెస్‌ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ రష్మిక సోమవారం విలేకర్లతో ముచ్చటించారు. (Chit chat with Rashmika mandanna)


హీరోయిన్‌ పాత్రను దాటి...

దర్శకుడు హను రాఘవపూడి ఆఫ్రిన్‌ పాత్ర గురించి చెప్పినప్పుడు కథకు కీలకం అని, గ్రేట్‌ ఆర్క్‌ వుందని అనిపించింది. ఇప్పటి దాకా నేను హీరోయిన్‌గానే చేశా. ఆ పాత్రలు దాటి చేయాలని నటిగా నాకు ఎప్పుడూ ఉంటుంది. అలాంటి తరుణంలో నాకు దక్కిన యునీక్‌ పాత్ర ఇది. గొప్ప కథని చెప్పే పాత్ర కావడం నాకు చాలా నచ్చింది. నేను కూడా కథను బలంగా నమ్మాను. ఆ నమ్మకం నిజమైంది. హను వల్లే ఈ సక్సెస్‌ సాధ్యమైంది. 




అది కరెక్ట్‌ కాదు..

అఫ్రిన్‌ లాంటి వైలెంట్‌ పాత్ర ఇంతవరకూ చేయలేదు. ఆ పాత్ర సవాల్‌ విసరడమే కాకుండా కొత్తగా అనిపించింది. రాబోతున్న సినిమాల్లో కూడా ఇలాంటి డిఫరెంట్‌ పాత్ర చేయబోతున్నా. ప్రయోగాత్మక చిత్రాలు చేయడం ప్రతి నటికి అవసరం. కంఫర్ట్‌ జోన్‌లో కూడా అవసరమే కానీ.. మూస పద్దతిలో చేసుకెళ్లడం కూడా కరెక్ట్‌ కాదు. ఇప్పుడు నా కంఫర్ట్‌ జోన్‌ దాటి సినిమాలు చేస్తున్నా. చారిత్రాత్మక చిత్రం ఒకటి చేయాలనుంది. అలాగే స్పోర్ట్స్‌, యాక్షన్‌, బయోపిక్‌.. ఇలా డిఫరెంట్‌ రోల్‌ చేయడం నా డ్రీమ్‌ రోల్‌. ఆట ఇప్పుడే కదా మొదలైంది. అన్నీ వరుసగా వస్తాయి.  


అదృష్టంతోపాటు హార్డ్‌వర్క్‌..

హిందీలో చేసిన తొలి సినిమా విడుదల కాకముందే మూడు అవకాశాలు రావడం లక్కీగా భావిస్తున్నా. హిందీలోనే కాదు.. తెలుగులోనూ ఇలాగే జరిగింది. ‘చలో’ షూటింగ్‌లో ఉండగా ‘గీత గోవిందం’, ‘దేవదాస్‌’ చిత్రాల అవకాశాలు వచ్చాయి. సరైన కథలు వస్తున్నపుడు అలా జరిగిపోతాయి. అదృష్టంతోపాటు హార్డ్‌వర్క్‌ కూడా చేయాలి. అప్పుడే మనం అనుకున్న గమ్యాన్ని సులభంగా చేరుతాం. 


Updated Date - 2022-08-09T00:38:37+05:30 IST