Rashmika mandanna: నువ్వే స్ఫూర్తి.. ఏం చేయగలవో చేసి చూపించు!
ABN, First Publish Date - 2022-07-03T22:59:40+05:30
‘గీత గోవిందం’ చిత్రంతో సక్సెస్ఫుల్ పెయిర్‌గా గుర్తింపు పొందారు విజయ్ దేవరకొండ– రష్మిక మందన్నా. ఆ తర్వాత కామ్రేడ్ చిత్రంలోనూ జతకట్టారు. అప్పట్లో వీరిద్దరిపై చాలా గాసిప్పులు వచ్చాయి. వాటి గురించి పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరూ చేసుకున్న కామెంట్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
‘గీత గోవిందం’ చిత్రంతో సక్సెస్ఫుల్ పెయిర్‌గా గుర్తింపు పొందారు విజయ్ దేవరకొండ– రష్మిక మందన్నా(Rashmika mandanna). ఆ తర్వాత కామ్రేడ్ చిత్రంలోనూ జతకట్టారు. అప్పట్లో వీరిద్దరిపై చాలా గాసిప్పులు వచ్చాయి. వాటి గురించి పట్టించుకోకుండా ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరూ చేసుకున్న కామెంట్లు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అసలు విసంలోకి వస్తే.. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘లైగర్’ చిత్రంలోని కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తన శరీరంపై బట్టలు లేకుండా పుష్పగుచ్చం అడ్డుపెట్టుకుని పోస్టర్లో కనిపిస్తున్నారు. (Vijay devarakonda inspiration for rashmika)
ఈ పోస్టర్ చూసిన రష్మిక స్పందించారు. ‘‘నీకు స్ఫూర్తి ఎవరు?’ అని నన్ను ఎంతోమంది అడిగారు. అలా అడిగిన ప్రతిసారీ ఎవరి పేరు చెప్పాలా అని ఆలోచించేదానిని. ఇకపై నీ పేరే చెబుతా విజయ్! మా అందరి ప్రేమ, సపోర్ట్ నీతో ఉన్నాయి. నువ్వు ఏం చేయగలవో ఈ ప్రపంచానికి చూపించు. ఆల్ ది బెస్ట్’’ అని రష్మిక పోస్ట్ చేశారు. ఆమె పోస్ట్‌కు విజయ్ రిప్లై ఇచ్చారు. ‘గీతగోవిందం’ టైమ్ నుంచి నువ్వే నా స్ఫూర్తి. లైగర్ మెరుపులు ప్రపంచం చూడబోతుందని నేను మాటిస్తున్నా’’ అని పోస్ట్ పెట్టారు. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. (liger)