Rashmika mandanna : మా మధ్య ఏమీ లేదు!
ABN, First Publish Date - 2022-08-12T22:32:18+05:30
‘గీత గోవిందం’ సినిమా సమయం నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా (Rashmika mandanna)డేటింగ్లో ఉన్నారని గాసిప్పులు వినిపిస్తూనే ఉన్నాయి. మధ్యలో విజయ్ (Vijay devarakonda)దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ‘చిల్ బ్రో... మేమిద్దం మంచి స్నేహితులం అంతే’ అంటూ సమాధానమిచ్చాడు
‘గీత గోవిందం’ సినిమా సమయం నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా (Rashmika mandanna)డేటింగ్లో ఉన్నారని గాసిప్పులు వినిపిస్తూనే ఉన్నాయి. మధ్యలో విజయ్ (Vijay devarakonda)దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ‘చిల్ బ్రో... మేమిద్దం మంచి స్నేహితులం అంతే’ అంటూ సమాధానమిచ్చాడు. రష్మిక కూడా అలాంటి జవాబే ఇచ్చారు. అయినప్పటికీ వీరిద్దరిపై వచ్చిన రూమర్స్‌కు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా మరోసారి ఈ గాసిప్ వైరల్ అవుతోంది. అయితే దీనిపై రష్మిక మరోసారి ఘాటుగా స్పందించారు. (Rashmika mandanna Dating)
నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ‘‘సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలనే సరదా ఉండడం సహజం. కానీ మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ అవే ప్రశ్నలు అడుగడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఐదు సినిమాలు చేస్తున్నా. వాటి గురించి అడిగితే ఎంత సేపు అయినా మాట్లాడతా. కానీ లేని దాని గురించి నన్ను ఏం మాట్లాడమంటారు? నా ప్రేమ, పెళ్లి విషయాల్లో వచ్చే గాసిప్పులను అసలు నమ్మొద్దు. అలాంటిది ఏమన్నా ఉంటే నేనే చెబుతాను. అప్పటి వరకూ ఏ నిర్ణయానికి రావొద్దు. అలాంటి వార్తలను నమ్మవద్దు’’ అని సెలవిచ్చారు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. (Rashmika dating with vijay devara konda)